Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాస్ సిలిండర్ పేలి ఒకే ఫ్యామిలీలో ఏడుగురు కూలీలు మృతి

Webdunia
శనివారం, 24 జులై 2021 (13:40 IST)
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ నగరంలో రాష్ట్రంలోని ఓ విషాదకర ఘటన జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వలస కూలీలు మృతి చెందారు. వీరందరినీ మధ్యప్రదేశ్ వాసులుగా గుర్తించారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్ నుంచి గుజరాత్​ వచ్చిన కూలీలు స్థానికంగా ఉన్న ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. వీరంతా ఒకే ఇంట్లో ఉంటూ వచ్చారు. 
 
అయితే శుక్రవారం రాత్రి ఇంట్లోని గ్యాస్ స్టౌ పేలడంతో ఈ ఏడుగురు కూలీలు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం శివ్​​రాజ్​ సింగ్​ చౌహాన్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 4లక్షలు పరిహారం ప్రకటించారు. గాయపడ్డ వారికి పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో వైద్యం అందిస్తామన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments