Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సెల్ఫీలు క్లిక్ చేసేవారు రూ.100 పార్టీ ఫండ్‌గా ఇవ్వాలి : ఎంపీ మంత్రి

సెల్ఫీలు క్లిక్ చేసేవారు రూ.100 పార్టీ ఫండ్‌గా ఇవ్వాలి : ఎంపీ మంత్రి
, సోమవారం, 19 జులై 2021 (09:36 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ ఒకటి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్గంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖా మంత్రిగా ఉన్న ఉషా ఠాకూర్ పార్టీ కార్యకర్తలకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. తనతో సెల్ఫీ దిగాలనుకుంటే వంద రూపాయలు చెల్లించాలని అభిమానులకు, కార్యకర్తలకు చెప్పారు.
 
ఇదే అంశంపై ఆమె స్పందిస్తూ, 'మిత్రులారా, సెల్ఫీలు తీసుకోవడానికి చాలా సమయం తీసుకుంటుందని మీకు తెలుసు. దీని వల్ల కొన్నిసార్లు మాకు చాలా ఆలస్యం అవుతుంది. కాబట్టి పార్టీ పరంగా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చాం. ఎవరైతే సెల్ఫీలు క్లిక్ చేస్తారో వారు స్థానిక పార్టీ యూనిట్‌ కోశాధికారికి రూ.100 జమ చేయాలి. ఇలా సమకూరిన డబ్బును పార్టీ పనుల కోసం వినియోగించుకోవచ్చు' అని తెలిపారు.
 
అంతేకాకుండా, బహిరంగ కార్యక్రమాలకు తనను పిలిచే వారు పుష్పగుత్తులకు బదులు పుస్తకాలు ఇవ్వాలని మంత్రి ఉషా సూచించారు. అలా అందిన పుస్తకాలతో పార్టీ కార్యాలయంలో లైబ్రరీని ఏర్పాటు చేయవచ్చని చెప్పారు. మరోవైపు ఈ బీజేపీ మంత్రి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా రెండు డోసుల టీకాలు వేయించుకున్న ప్రజలు పీఎం కేర్స్‌ నిధి కోసం రూ.500 విరాళంగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలోనే జగన్ అరుదైన రికార్డు: ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి