ఆ ఇంట్లో పాములే పాములు.. పరుగులు తీసిన జనం

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (11:41 IST)
యూపీలోని ముజాఫర్ నగర్ ఖతౌలీ నగర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.  వివరాల్లోకి వెళితే.. అశోక్ విహార్ ఆవాస్ వికాస్ కాలనీలోని కడ్లి గ్రామానికి చెందిన రంజిత్ సింగ్ ఇంటి నంబర్ ఇ-218 ఉంది. ఈ క్రమంలో నరేష్‌పాల్‌ కుటుంబానికి ఇంటిని అద్దెకు ఇచ్చారు. 
 
మే 8వ తేదీన వాషింగ్ మెషీన్ దగ్గర పాములు సంచరిస్తున్నట్లు నరేష్‌పాల్ భార్య గమనించింది. ఈ క్రమంలో ఆమెకు మరికొన్ని పాములు కనిపించాయి. 
 
ఈ విషయాన్ని ఇంటి యజమానికి చెప్పింది. దీంతోపాటు ఇంటిని ఖాళీ సైతం చేశారు. ఆ తర్వాత యజమాని పాములు ఎక్కడ ఉన్నాయో వెతకడం మొదలుపెట్టాడు.
 
ఈ క్రమంలో బుధవారం కూలీలను పెట్టి పాములను వెతుకుతూ.. బాత్‌రూమ్‌, టాయిలెట్‌ ఫ్లోర్‌లను తొలగించారు. దాని కింద దాదాపు 60 పాములు నక్కి ఉన్నాయి. దీంతోపాటు 75 గుడ్లు కూడా లభించాయి. పాములు ఒక్కసారిగా పరుగులు తీయడంతో.. కాలనీ వాసులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
 
సమాచారం మేరకు పాములను పట్టుకునేందుకు స్నేక్ క్యాచర్ వచ్చి.. గంటల కొద్ది శ్రమించి పాములను సీసాలలో బంధించి తీసుకెళ్ళాడు. దీంతో కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

SSMB29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతుందా?

Shyamala Devi : గుమ్మడి నర్సయ్య దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీ

NBK 111: బాలక్రిష్ణ నటిస్తున్న ఎన్.బి.కె. 111 చిత్రం నవంబర్ 7న ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments