Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విరాట్ కోహ్లీ అదుర్స్.. 7000 పరుగులతో అరుదైన రికార్డ్ (video)

kohli
, శుక్రవారం, 20 మే 2022 (10:35 IST)
ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరిశాడు. గురువారం గుజరాత్ టైటాన్స్‌పై హాఫ్ సెంచరీతో దుమ్మురేపి, తన పేరిట ఓ భారీ రికార్డును నమోదు చేసుకున్నాడు. కోహ్లితో పాటు బెంగుళూరు తరపున ఏబీ డివిలియర్స్ 4522 పరుగులు చేయగా, క్రిస్ గేల్ 3420 పరుగులు చేసి మూడో స్థానంలో ఉన్నాడు. 
 
ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఇన్నింగ్స్‌తో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో కోహ్లీ ప్లేఆఫ్‌కు వెళ్లాలనే ఆశను సజీవంగా ఉంచుకుంది. ప్రస్తుతం ఢిల్లీ ఓడిపోతే ప్లేఆఫ్‌కు వెళ్లేందుకు ఛాన్స్ ఉంది.
 
కాగా... గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 54 బంతుల్లో మొత్తం 73 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టాడు. 135 కంటే ఎక్కువ స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో కోహ్లీ సిక్సర్‌తో 45వ అర్ధ సెంచరీని నమోదు చేశాడు.
 
ఈ మ్యాచ్‌లో కోహ్లీ 54 పరుగులు చేసిన వెంటనే భారీ రికార్డు అతని పేరులో వచ్చి చేరింది. టీ20 క్రికెట్‌లో ఫ్రాంచైజీ తరపున 7000 పరుగులు చేసిన ప్రపంచంలోనే తొలి బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున విరాట్ కోహ్లి టీ20 క్రికెట్‌లో 7 వేల పరుగుల సంఖ్యను చేరుకున్నాడు.
 
2008 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో కోహ్లీకి మంచి అనుబంధం వుంది. తద్వారా ఐపీఎల్ 15 సీజన్‌లతో పాటు ఛాంపియన్స్ లీగ్‌లో బెంగళూరు తరపున ఆడాడు. ఈ కారణంగా, అతను 7 వేలకు పైగా పరుగులు సాధించాడు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రపంచ బాక్సింగ్ వేదికపై మెరిసిన తెలుగు తేజం జరీన్