హోం వర్క్ చేయలేదనీ చెట్టుకు వేలాడదీసిన టీచర్లు

ఠాగూర్
మంగళవారం, 25 నవంబరు 2025 (15:13 IST)
ఛత్తీస్‍‌గఢ్ రాష్ట్రంలో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. హోం వర్క్ చేయలేదన్న అక్కసుతో ఓ విద్యార్థిని కొందరు ఉపాధ్యాయులు చెట్టుకు వేలాడదీశారు. ఈ ఘటన సూరజ్‌పూర్ జిల్లా నారాయణ్‌పూర్‌లోని హంసవాణి విద్యామందిర్‌లో వెలుగుచూసింది. బాలుడుని చెట్టుకు వేలాడతీసిన దృశ్యాన్ని కొందరు స్థానికులు వీడియో, ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది వైరల్ అయింది.
 
దీనిపై ఆగ్రహానికి గురైన గ్రామస్థులు ఆ టీచర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పాఠశాల వద్ద పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ స్పందిస్తూ.. దీనిపై దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపింది. సమగ్ర విచారణ జరుపుతామని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
 
కాగా, పాఠశాలకు చెందిన సుభాష్‌ శివహరే అనే వ్యక్తి ఈ చర్యను సమర్థిస్తూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇది చిన్న శిక్షగా ఆయన అభివర్ణించారు. సరిగ్గా చదువుకోవాలని పిల్లాడిని భయపెట్టేందుకే ఇలా చేశారని వ్యాఖ్యానించారు. సుభాష్‌ వ్యాఖ్యలు గ్రామస్థుల ఆగ్రహాన్ని మరింత పెంచింది. ఈ క్రమంలో పాఠశాల్లో కొనసాగుతున్న చర్యలపై అధికారులు విచారణను ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments