Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ర్యాగింగ్ పేరుతో నరకం.. మర్మాంగానికి డంబెల్స్ కట్టి... పదునైన పరికరాలతో గుచ్చి వేధింపులు..

Advertiesment
Dumbbells Hung From Private Parts

ఠాగూర్

, గురువారం, 13 ఫిబ్రవరి 2025 (09:08 IST)
కేరళ రాష్ట్రంలో ర్యాగింగ్ బూతం ఒక్కసారిగా పడగవిప్పింది. ఇటీవల తొమ్మిదో తరగతి చదవుతున్న బాలుడుని ర్యాగింగ్ పేరుతో చిత్రహింసలు పెట్టారు. బాయిలెట్‌ను నాలుకతో నాకించారు. శరీర రంగు పేరుతో వేధించారు. సీనియర్లు పెట్టిన ఈ వేధింపులను తాళలోని ఆ బాలుడు ప్రాణాలు తీసుకున్నాడు. తాజాగా కేరళ ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో ర్యాగింగ్ భూతం వెలుగు చూసింది. 
 
ర్యాగింప్ పేరుతో కొందరు సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులపై చిత్రహింసలకు పాల్పడ్డారు. మర్మాంగాలకు డంబెల్స్ కట్టి.. పదునైన పరికాలతో గుచ్చి గుచ్చి వేధించారు. మద్యానికి బానిసై డబ్బుల కోసం డిమాండ్ చేశారు. ఈ దారుణ ఘటన కొట్టాయం ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో జిరగింది. ఈ కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 
 
కొట్టాయం ప్రభుత్వ జూనియర్ కాలేజీ మూడో సంవత్సరం చదువుతున్న ఐదుగురు విద్యార్థులు... మొదటి సంవత్సరానికి చెందిన ముగ్గురు విద్యార్థులను ర్యాగింగ్‌ పేరుతో చిత్రహింసలు పెట్టారు. వారిని నగ్నంగా నిలబెట్టి వారి మర్మాంగాలకు డంబెల్స్ వేలాడదీశారు. అక్కడితో ఆగకుండా కంపాస్‌లోని పదునైన పరికరాలను గుచ్చి గాయపర్చారు. ఇలా గత మూడు నెలలుగా వేధిస్తూ వచ్చారు. 
 
దీంతో గాయాలైన మర్మాంగాలకు బాధితులు లోషన్ పూసుకుంటే, విషయం తెలుసుకున్న సీనియర్లు మరింతగా రెచ్చిపోయారు. ఆ లోషన్‌ను వారు నుంచి బలవంతంగా లాక్కుపని దానిని వారి నోట్లో పిండారు. అంతేకాదు, ప్రతిదానిని వీడియో తీశారు. ఈ విషయాన్ని బయటకు చెబితే అకడమిక్ కెరీర్‌ను నాశనం చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. 
 
మద్యానికి బానిసలైన నిందితులు ఈ దమనకాండకు పాల్పడ్డారు. సీనియర్ల ఆగడాలు నానాటికీ పెరిగిపోతుండటంతో భరించలేని ఓ జూనియర్ విద్యార్థి తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. దీంతో బాధితుడు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సలహా ఇచ్చాడు. దీంతో ముగ్గురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత యేడాది నవంబరు నెల నుంచి తమను సీనియర్లు వేధిస్తున్నారంటూ తమ బాధలను ఏకరవు పెట్టారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు సీనియర్ విద్యార్థులైన శామ్యాూల్, జాన్సన్, జీవా, రాహుల్ రాజ్, రిజిల్ జీత్, వివేక్‌లపై ర్యాగింగ్ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎట్టకేలకు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు