Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీంకోర్టులో కరోనా ఉధృతి - నలుగురు జడ్జీలకు పాజిటివ్

Webdunia
ఆదివారం, 9 జనవరి 2022 (17:26 IST)
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో కరోనా కలకలం చెలరేగింది. నలుగురు న్యాయమూర్తులకు ఈ వైరస్ సోకింది. అలాగే, సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి చెందిన 150 మంది ఉద్యోగులకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ కరోనా వైరస్ బారినపడినవారంతా గత మంగళవారం జస్టిస్ సుభాషణ్ రెడ్డి రిటైర్మెంట్ కార్యక్రమానికి హాజరుయ్యారు. 
 
ఆ తర్వాత ఆయనకు పాజిటివ్ నిర్ధారణ అయింది. పిమ్మట చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణతో పాటు.. మరో నలుగురు న్యాయమూర్తులు కలిసి గత గురువారం కోవిడ్ వ్యాప్తి రివ్యూ మీటింగ్‌లో పాల్గొన్నారు. 
 
ప్రస్తుతం సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో పాటు 32 మంది న్యాయమూర్తులు ఉన్నారు. వీరిలో నలుగురికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. వీరితో పాటు.. కరోనా వైరస్ బారినపడిన 150 మంది ఉద్యోగులు క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. 
 
ఢిల్లీతో సహా దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో వారానికి మూడు రోజుల మాత్రమే వర్చువల్ మోడ్‌లో కేసు విచారణ జరుగుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments