Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహా సంక్షోభం.. అంతకంతకూ పెరుగుతున్న ఏక్‌నాథ్ షిండే బలం

Webdunia
గురువారం, 23 జూన్ 2022 (14:07 IST)
మహారాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని ప్రభుత్వం పతనం అంచున ఉంది. శివసేనకు చెందిన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. ఈ పార్టీకే చెందిన సీనియర్, కీలక నేత ఏక్‌నాథ్ షిండేకు మద్దతు ప్రకటించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. బుధవారానికి 40 మంది ఎమ్మెల్యే మద్దతు ఉంది. తాజాగా మరో నలుగురు ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. దీంతో ఆయనకు మద్దతునిచ్చే స్వతంత్రులతో కలుపుకుని మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 46కు చేరింది. కొత్తగా మద్దతు ప్రకటించిన నలుగురు ఎమ్మెల్యేలు కూడా గౌహతికి చేరుకున్నారు. 
 
ఇదిలావుంటే, తమ పార్టీకే చెందిన శాసనసభ సభ్యులు తిరుగుబాటు చేయడంతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బుధవారం రాత్రే తన అధికారిక నివాసం వర్షను ఖాళీ చేసి తన సొంత నివాసమైన మాతోశ్రీకి చేరుకున్నారు. అయితే, శివసేన ఎమ్మెల్యేలు కోరితే తాను సీఎం పదవినే కాదు పార్టీ అధ్యక్ష పదవిని కూడా త్యజించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. 
 
అంతేకాకుండా తాను బాల్‌ఠాక్రే కుమారుడునని, అధికారం కోసం వెంపర్లాడే వ్యక్తిని కాదని ఉద్ధవ్ ఠాక్రే పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. హిందుత్వ అజెండాను శివసేన పార్టీ ఎన్నటికీ వీడిబోదని, తనపై తిరుగుబాటు చేసిన తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై శివసైనికులే కూర్చొంటారని గ్యారెంటీ ఉందా అని ఆయన రెబెల్ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments