Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం - అగ్నికి ఆహుతైన గోవులు

Webdunia
మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (10:35 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. భారీ అగ్నిప్రమాదంలో ఆవులు మంటల్లో కాలిపోయాయి. ఈ విషాదకర ఘటన యూపీలోని ఇందిరాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కనవాణి అనే గ్రామంలో జరిగింది. డంప్‌యార్డులో చెలరేగిన మంటల కారణంగా పక్కనే ఉన్న గోశాలకు ఈ మంటలు వ్యాపించాయి. దీంతో 38 మంది ఆవులు చనిపోయాయి. 
 
ఈ ప్రమాదంపై శ్రీకృష్ణ గోశాల ఆపరేటర్ సూరజ్ పండిట్ మాట్లాడుతూ, గోశాల పక్కనే ఉన్న డంప్‌యార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని, ఈ మంటలు క్షణాల్లో వ్యాపించి గోశాల పూర్తిగా దగ్ధమైపోయిందని తెలిపారు. దీంతో గోశాలలో ఉన్న 150 ఆవుల మందలో 38 ఆవులు మంటల్లో కాలిపోయినట్టు వివరించారు. 
 
ఈ ప్రమాద వార్త తెలుసుకోగానే పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశాయి. అలాగే, ప్రమాదంపై లోతుగా విచారణ జరిపేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్టు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa 2 Collection: రూ: 1500 కోట్లకు చేరువలో పుష్ప-2

ఓజీలో ఐటెం సాంగ్ కు సిద్ధమవుతున్న నేహాశెట్టి !

యాక్షన్ థ్రిల్లర్ గా కిచ్చా సుదీప్ మ్యాక్స్ డేట్ ఫిక్స్

డ్రింకర్ సాయి నుంచి అర్థం చేసుకోవు ఎందుకే.. లిరికల్ సాంగ్

రామ్ చ‌ర‌ణ్, కియారా అద్వాణీ కెమిస్ట్రీ హైలైట్ చేస్తూ డోప్ సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

తర్వాతి కథనం
Show comments