Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌లో బ్రెయిన్ ఫీవర్.. 36మంది చిన్నారుల మృతి.. రాత్రిపూట ఆహారం తీసుకోకుండా?

Webdunia
బుధవారం, 12 జూన్ 2019 (15:47 IST)
బీహార్‌లోని ముజాఫర్ జిల్లాలో బ్రెయిన్ ఫీవర్ కారణంగా 48 గంటల్లో 36 మంది చిన్నారులు దారుణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఈ బ్రెయిన్ ఫీవర్‌తో బాధపడుతున్న 133 మంది చిన్నారులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 
 
వేసవి కావడంతో పాటు మండే ఎండల కారణంగా హైపోగ్లిసిమియా అనే బ్రెయిన్ ఫీవర్ చిన్నారులకు సోకుతుందని.. ఈ ఫీవర్‌తో మెదడు దెబ్బేనని... దీని ప్రభావంతో పక్షవాతం, కోమా ఏర్పడటం వంటి అవకాశాలున్నాయని.. 15 ఏళ్లకు లోబడిన వారు ఈ వ్యాధి సులభంగా సోకుతుందని.. దీంతో మృతుల సంఖ్య కూడా పెరుగుతుందని వైద్యులు చెప్పారు. 
 
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన చిన్నారులే అధికం. గత ఏడాది కంటే ఈ సంవత్సరం బ్రెయిన్ ఫీవర్‌తో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల సంఖ్య ఎక్కువని వైద్యులు తెలిపారు. ఈ ఫీవర్‌పై అవగాహన లేకపోవడం.. ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలను ప్రభుత్వం చేయకపోవడం ద్వారా చిన్నారులు బ్రెయిన్‌ ఫీవర్‌తో ప్రాణాలు కోల్పోయారు.  
 
ఇకపోతే.. రాత్రిపూట ఆహారం తీసుకోకుండా అలానే నిద్రించే పిల్లల్లో బ్రెయిన్ ఫీవర్ సోకే ప్రమాదం వుందని.. ఆహారం తీసుకోకుండా రాత్రి నిద్రిస్తే.. రక్తంలో హైపోగ్లిసిమియా వ్యాప్తింటే అవకాశం వుందని.. అందుచేత రాత్రిపూట పిల్లలు నిద్రించేందుకు ముందే ఆహారం ఇచ్చేయాలని.. ఆహారం తీసుకోకుండా నిద్రించడం ద్వారా ఇలాంటి రోగాలను కొనితెచ్చుకున్నట్లవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో త్రిబాణధారి బార్భరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments