Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

ఠాగూర్
బుధవారం, 14 మే 2025 (22:44 IST)
తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా చేశాయి. ఉసురు పోలీస్ స్టేషన్‌ పరిధిలోని కర్రెగుట్ట కేంద్రంగా చేపట్టిన ఆపరేషన్‌లో మొత్తం 31 మంది మావోయిస్టులు మరణించినట్టు సీఆర్పీఎఫ్ డీజీపీ జీపీ సింగ్, ఛత్తీస్‌గఢ్ డీజీపీ అరుణ్ దేవ్ గౌతం ప్రకటించారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను బుధవారం బీజాపూర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు వెల్లడించారు. 
 
సుమారు 21 రోజులు పాటు సాగిన ఈ కీలక ఆపరేషన్‌లో మృతి చెందిన 31 మంది మావోయిస్టులలో 16 మంది మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు. హతమైన మావోయిస్టులపై ప్రభుత్వం గతంలో మొత్తం రూ.1.72 కోట్ల రివార్డును ప్రకటించిన పేర్కొన్నారు. ఈ ఎదురుకాల్పులు, ఆపరేషన్‌ క్రమంలో 18 మంది భద్రతా సిబ్బంది గాయపడినట్టు వెల్లడించారు. మరణించిన మావోయిస్టులలో ఇప్పటివరకు 20 మంది గుర్తించామని, మరో 11 మందిని గుర్తించాల్సి వుందని తెలిపారు. ఘటనా స్థలం నుంచి 35 అత్యాధునిక ఆయుధాలను కూడా భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. 
 
ఈ యేడాది ఏప్రిల్ 21 వ తేదీన ప్రారంభమైన కర్రెగుట్ట ఆపరేషన్‌ మే 11వ తేదీ వరకు కొనసాగిందని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలలో భాగంగా ఈ సంవత్సరం ఇప్పటివరకు మొత్తం 174 మంది కరుడుగట్టిన మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు వారు ఈ సందర్భంగా తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments