Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంధేరి హోటల్ గదిలో 30 యేళ్ల ముంబై మోడల్ ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (14:51 IST)
ముంబైలోని అంధేరిలో ఉన్న ఓ హోటల్‌లో 30 యేళ్ల మోడల్ ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఫ్యానుకు ఉరి వేసుకుని ఈ దారుణానికి పాల్పడ్డారు. హోటల్ గదిలోని ఫ్యానుకు మోడల్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 
 
పోలీసులు కథనం మేరకు.. బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో మృతురాలు హోటల్‌ గదిలో ఓ గదిని అద్దెకు తీసుకుంది. రాత్రి భోజనానికి కూడా ఆర్డరిచ్చింది. అయితే, గురువారం ఉదయం నుంచి ఆమె తలుపు తెరవలేదు. దీంతో హౌస్ కీపింగ్ సిబ్బంది పలుమార్లు తలుపు తట్టినట్టినప్పటికీ ఆమె వైపు నుంచి స్పందన రాలేదు. దీంతో హోటల్ మేనేజరు పోలీసులకు సమాచారం అందించారు. 
 
దీంతో పోలీసులు హోటల్‌కు వచ్చి గది తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా మోడల్ ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. ఈ గదిలోనే ఆమె రాసిపెట్టిన ఓ సూసైడ్ లేఖను కూడా స్వాధీనం చేసుకున్నారు. "నన్ను క్షమించండి. నా మరణానికి ఏ ఒక్కరూ కారణం కాదు. నేను సంతోషంగా లేను. నాకు శాంతి కావాలి. అందుకే వెళ్లిపోతున్నా" అంటూ అందులో పేర్కొన్నారు. అయితే, ఆత్మహత్య చేసుకున్న మోడల్ పేరు, ఇతర వివరాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

No Telugu: పబ్లిసిటీలో ఎక్కడా తెలుగుదనం లేని #సింగిల్ సినిమా పోస్టర్లు

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments