Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొబ్బరి బోండాం తాగాడని బాలుడుని చితకబాదిన ముగ్గురు యువకులు...

కర్ణాటకలో దారుణం వెలుగుచూసింది. తోటలోని కొబ్బరి చెట్టు ఎక్కి కొబ్బరి బోండాం తాగాడన్న కసితో ముగ్గురు యువకులు 8 ఏళ్ళ బాలుడిపై అత్యంత పైశాచికంగా దాడికి పాల్పడ్డారు. ఇకపై అలాంటి పని చేయను.. తనను వదిలేయాలని కాళ్లావేళ్లాపడి ప్రాధేయపడినా వాళ్ల మనసు కరగలేదు.

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2016 (14:47 IST)
కర్ణాటకలో దారుణం వెలుగుచూసింది. తోటలోని కొబ్బరి చెట్టు ఎక్కి కొబ్బరి బోండాం తాగాడన్న కసితో ముగ్గురు యువకులు 8 ఏళ్ళ బాలుడిపై అత్యంత పైశాచికంగా దాడికి పాల్పడ్డారు. ఇకపై అలాంటి పని చేయను.. తనను వదిలేయాలని కాళ్లావేళ్లాపడి ప్రాధేయపడినా వాళ్ల మనసు కరగలేదు.  ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ వివరాలను పరిశీలిస్తే...
 
సెప్టెంబర్‌ 29న హాసన జిల్లా అరసికెరె తాలూకాలోని ఓ తోటలో ఎనిమిదేళ్ల కుర్రాడు కొబ్బరిచెట్టెక్కి ఓ కాయను కోచి.. అందులోని నీటిని తాగాడు.ఆ బాలుడు నీళ్లు తాగడాన్ని ముగ్గురు యువకులు చూశారు. దీంతో బాలుడ్ని టార్చర్ చేయడం మొదలుపెట్టారు. చీమలపుట్ట మధ్యలోవున్న స్టోన్ పిల్లర్‌పై నిలబెట్టి చిత్ర హింసలు పెట్టారు. చీమలు కుడుతున్నాయని, తనను వదిలేయాలని ప్రాధేయపడినా మనసు కరగలేదు. 
 
పైగా తాళ్లు, కర్రెలతో బాలుడిని గొడ్డును బాదినట్టు బాదారు. ఈ తతంగాన్నిఅటుగా వెళ్తున్న ఓ వ్యక్తి తన సెల్‌ఫోన్ కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ విషయం బాలుడి బంధువులకు తెలియడంతో వాళ్లపై ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని అత్యంత కిరాతకంగా హింసించిన ఈ యువకుల్ని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments