Webdunia - Bharat's app for daily news and videos

Install App

డియర్ బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్... నా పేరు బ్రూక్ బ్లెయిర్...నాకు ఐదేళ్లు.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన చిన్నారి వీడియో

డియర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ బ్రిటన్ ప్రధానమంత్రికి ఆ దేశానికే చెందిన ఐదేళ్ళ చిన్నారి రాసిన లేఖ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ చిన్నారి పేరు బ్రూక్ బ్లెయిర్. ఈ చిన్నారి బ్రిటన్ ప్రధాని థ్రేసా

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2016 (14:46 IST)
డియర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ బ్రిటన్ ప్రధానమంత్రికి ఆ దేశానికే చెందిన ఐదేళ్ళ చిన్నారి రాసిన లేఖ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ చిన్నారి పేరు బ్రూక్ బ్లెయిర్. ఈ చిన్నారి బ్రిటన్ ప్రధాని థ్రేసా మేకు ఓ లేఖ రాయడమే కాకుండా, అందులోని సారాంశాన్ని చదువుతూ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. 
 
ఐదేళ్ల చిన్నారి బ్రిటన్ ప్రధానిని ఆగ్రహంతో ప్రశ్నించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. లండన్ కు చెందిన బ్రూక్ బ్లెయిర్ (5) సోషల్ మీడియాలో ఆ దేశ ప్రధానిని నిలదీసిన వీడియో అక్కడి మీడియాలో ప్రముఖంగా ప్రచురితమైంది.
 
దీంతో బ్రూక్ బ్లెయిర్ రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోయింది. ఆ వీడియోలో ఆమె చెప్పింది ఆమె మాటల్లోనే..."నా పేరు బ్రూక్ బ్లెయిర్... నాకు ఐదేళ్లు... ప్రధాని థ్రేసా మే, మీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. నిన్న రాత్రి వీధుల్లో వెళ్తుంటే.. వందలమంది ఇళ్లులేని అభాగ్యులను చూశాను. వాళ్ల కనీస అవసరాలు కూడా తీరడం లేదు... థ్రేసా మే... మీరు వాళ్లికి బిస్కెట్లు, చాక్లెట్లు, శాండ్ విచెస్ ఇవ్వాలి, ఇల్లు కట్టాలి... చూడండి... నాకు కేవలం ఐదేళ్లు.. నేను వాళ్లకి ఏమీ చేయలేకపోతున్నాను.
 
నేను వాళ్లకి సరిపడా డబ్బులు దాయలేదు... నేను దాచుకున్న డబ్బులు వారికి సరిపోవు. మీ దగ్గర డబ్బులున్నాయి. కొంత ఖర్చుచేయండి... వాళ్లకి సహాయం చేయండి... మీరలా చేయడం లేదు. మీరు చేయాల్సింది అదే... దేశంలో చాలా యుధ్ధాలు వచ్చాయి. వాటికోసం ఎంతో డబ్బులు ఖర్చుచేస్తున్నారు. మందు వీరికి సాయం చెయ్యిండి.. థ్రేసా మే... చాలా కోపంగా ఉన్నాను". అంటూ ముగించింది. 
 
ఈ వీడియోను సోషల్ మీడియాలో అక్టోబర్ 5న పోస్టు చేయగా తొలి రోజు యూట్యూబ్ ‌ 17,000 మంది చూశారు. ఫేస్‌బుక్‌లో దీనిని 90,000 మంది చూశారు. దీంతో మీడియాలో కూడా ఇది ప్రముఖంగా ప్రసారమైంది.

శర్వానంద్, కృతి శెట్టి ల మనమే విడుదలకు సిద్దమైంది

వ్యవసాయమే పెళ్లికి అడ్డుగా మారితే తిరుపతి ఏమిచేసాడన్నదే కన్యాకుమారి చిత్రం

అవకాశాలు ఇస్తారని వేచి చూడను, క్రియేట్ చేసుకుంటా: మంచు లక్ష్మి

ప్రభుదేవ, కాజోల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాతో చరణ్ తేజ్ బాలీవుడ్‌లో ఎంట్రీ

టైసన్ నాయుడు కీలక షెడ్యూల్ రాజస్థాన్‌లో ప్రారంభం

ప్రోటీన్ సప్లిమెంట్లను భర్తీ చేయగల సహజమైన, ప్రోటీన్ అధికంగా కలిగిన ఆహారం

షుగర్ వ్యాధిని అదుపులోకి తెచ్చే పదార్థాలు ఏంటి?

బెల్లం టీ తాగండి.. పొట్ట చుట్టూ కొవ్వును ఇట్టే కరిగించుకోండి..

కిడ్నీలను ఆరోగ్యంగా వుంచుకునే ఆహారం.. ఖాళీ కడుపుతో వెల్లుల్లి..

ఈ ఫుడ్ తింటే 50 ఏళ్లు దాటినా 30 ఏళ్ల వారిలా కనబడుతారు

తర్వాతి కథనం
Show comments