Webdunia - Bharat's app for daily news and videos

Install App

యుద్ధం భారత్ పైన కాదు... టెర్రరిస్టులపైన... ఏరివేయండి: నవాజ్ షరీఫ్, పాక్ సైన్యం షాక్

పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తీసుకున్న నిర్ణయం ఆయన ప్రభుత్వాన్ని ఏం చేస్తుందో తెలియదు కానీ, ఆయన సర్కారు ఆదేశాలు మాత్రం పాకిస్తాన్ సైన్యానికి మింగుడుపడటంలేదు. వదిలితే భారతదేశంపై యుద్ధం చేసి తమ సత్తా చూపిస్తాం అంటూ ఉవ్విళ్లూరుతున్న పాకిస్తాన్ సై

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2016 (13:50 IST)
పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తీసుకున్న నిర్ణయం ఆయన ప్రభుత్వాన్ని ఏం చేస్తుందో తెలియదు కానీ, ఆయన సర్కారు ఆదేశాలు మాత్రం పాకిస్తాన్ సైన్యానికి మింగుడుపడటంలేదు. వదిలితే భారతదేశంపై యుద్ధం చేసి తమ సత్తా చూపిస్తాం అంటూ ఉవ్విళ్లూరుతున్న పాకిస్తాన్ సైన్యానికి నవాజ్ షరీఫ్ వీపుపై చరిచినట్లు ఓ ఆదేశం ఇచ్చారు. యుద్ధం చేయాల్సింది భారతదేశం పైన కాదనీ, దేశంలో ఉన్న ఉగ్రవాదులపైన అని, కనుక తక్షణమే దేశంలో ఉన్న ఉగ్రవాదులను ఏరివేయాలంటూ ఆయన సర్కారు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు డాన్ పత్రికలో వార్త ప్రచురించింది.
 
యూరి ఘటన నేపధ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం అంతర్జాతీయంగా అనేక ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. ఈ నేపధ్యంలో దేశంలో పాతుకుపోయి ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న జైష్-ఎ-మహ్మద్ గ్రూపుతో సహా ఇతర మిలిటెంట్ గ్రూపులన్నిటినీ నాశనం చేయాలని నవాజ్ షరీఫ్ ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు తనకు మద్దతునిస్తున్న చైనా సైతం ఉగ్రవాదులు పేట్రేగిపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. దీనితో పాకిస్తాన్ దేశానికి టెర్రరిస్టులపై చర్యలు తీసుకోవడం మినహా మరో మార్గం లేకుండాపోయింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments