పెళ్లి ఇష్టం లేక... చేతిని కోసుకుని కిడ్నాప్, రేప్ నాటకమాడిన యువతి.. విచారణలో గుట్టురట్టు

పెద్దలు కుదుర్చిన పెళ్లి ఇష్టంలేని ఓ యువతి... చేతిని కోసుకుని కిడ్నాప్, రేప్ నాటకమాడింది. కానీ, ఆ యువతిని సందేహించిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీల

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2016 (13:45 IST)
పెద్దలు కుదుర్చిన పెళ్లి ఇష్టంలేని ఓ యువతి... చేతిని కోసుకుని కిడ్నాప్, రేప్ నాటకమాడింది. కానీ, ఆ యువతిని సందేహించిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే... ఈ వివరాలను పరిశీలిస్తే. 
 
బెంగళూరు నగరంలోని ఆదర్శ్ పీయూ కళాశాలలో ఓ యువతి పీయూసీ రెండో సంవత్సరం చదువుతోంది. ఈమెకు ఫర్హాన్ అహ్మద్‌ అనే బాయ్‌ఫ్రెండ్‌ను ప్రేమించింది. ఈ ప్రేమ వ్యవహారం రెండేళ్లుగా సాగుతోంది. ఈ విషయం తెలియని యువతి తల్లిదండ్రులు... తమ కూతురికి వేరే అబ్బాయితో పెళ్లి చేయాలని అమ్మాయి తల్లిదండ్రులు అనుకుంటున్నారు. దీంతో ఆందోళన చెందిన అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్ అయిన ఫర్హాన్ అహ్మద్‌కు ఫోన్ చేసి సంతోషిమాత దేవాలయం వద్దకు రమ్మని కోరింది. 
 
ఫర్హాన్ తన స్నేహితుడితో కలిసి స్కూటరుపై 10.20 గంటలకు రాగా, అమ్మాయి వారితో అతని గ్యారేజీలోనే తెల్లవారుజామున రెండు గంటల వరకు ఉంది. అనంతరం ఇంటికి వెళ్లేటపుడు అమ్మాయి తన చేతిపై గాయపర్చుకొని కిడ్నాప్, రేప్ యత్నం డ్రామా ఆడింది. అమ్మాయి, అబ్బాయిల మధ్య నడిచిన వాట్స్‌అప్ మెసేజ్‌లు వారు ఉన్న ప్రాంతం, వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ వ్యవహారం పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది.  
 
దీనిపై పోలీసులు ఐపీసీ 363 కింద కేసు నమోదు చేసి నిందితులైన ఇద్దరు యువకులు ఫర్హాన్ అహ్మద్(18), సందీప్ సేన్(18)లను అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఈ కేసులో అనుమానం వచ్చిన పోలీసులు అమ్మాయిని ప్రశ్నిస్తే అసలు విషయం వెలుగుచూసింది. కిడ్నాప్, రేప్ యత్నం నాటకమని పోలీసుల దర్యాప్తులో తేలింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments