Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలద్వారం ద్వారా బంగారం స్మగ్లింగ్... ఎలా?

Webdunia
శుక్రవారం, 16 నవంబరు 2018 (09:06 IST)
బంగారం అక్రమ రవాణాకు స్మగ్లర్లు కొత్తకొత్త దారులు వెతుకుతున్నారు. ఇందులోభాగంగా, ముగ్గురు వ్యక్తులు 1.25 కేజీల బంగారాన్ని మలద్వారంలో పెట్టుకుని అక్రమ రవాణా చేస్తూ ఎయిర్‌పోర్టు అధికారులకు చిక్కారు. తిరుచ్చి విమానాశ్రయంలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కౌలాలంపూర్ నుంచి తిరుచ్చికి ఎయిర్ ఇండియా విమానం ఒకటి వచ్చింది. ఈ విమానంలో కొందరు ప్రయాణికులు స్మగ్లింగ్ చేస్తున్నట్టు ఎయిర్‌పోర్టు అధికారులకు ముందుగానే సమాచారం అందింది. దీంతో విమానం తిరుచ్చికి చేరుకోగానే, ప్రయాణికులందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. 
 
అత్యాధునిక స్కానింగ్ పరికరాలు ఏ ఒక్కరివద్ద బంగారం ఉన్నట్టు గుర్తించలేక పోయాయి. అయితే, ముగ్గురు ప్రయాణికుల తీరు అనుమానాస్పదంగా ఉండటంతో వారిని మరో గదిలోకి తీసుకెళ్లి విచారించారు. ఈ విచారణలో నిజం వెల్లడించారు. 
 
మలద్వారం, అరికాలికి రసాయన పదార్థాలతో అంటించి బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్టు వెల్లడించారు. వీరి నుంచి 1.25 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రయాణికులను రియాజ్ అహ్మద్, తమీమ్ అన్సారీ, జకీర్ హుస్సేన్‌లుగా గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments