Webdunia - Bharat's app for daily news and videos

Install App

#NTPCExplosion : ప్రధాని దిగ్భ్రాంతి.. బాధితులకు రాహుల్ పరామర్శ

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లా ఉన్చాహర్‌లోని ఎన్టీపీసీ ఆరో ప్లాంట్‌లో జరిగిన భారీ పేలుడులో చనిపోయిన వారి సంఖ్య 26కు చేరింది. మరో 100 మందికి గాయాలయ్యాయి. బాయిలర్ ప్లాంట్‌లోని స్టీమ్‌పైపు పేలడంతో ప

Webdunia
గురువారం, 2 నవంబరు 2017 (13:01 IST)
ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లా ఉన్చాహర్‌లోని ఎన్టీపీసీ ఆరో ప్లాంట్‌లో జరిగిన భారీ పేలుడులో చనిపోయిన వారి సంఖ్య 26కు చేరింది. మరో 100 మందికి గాయాలయ్యాయి. బాయిలర్ ప్లాంట్‌లోని స్టీమ్‌పైపు పేలడంతో ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాద సమయంలో దాదాపు 150మంది కార్మికులు ఉన్నారు. 
 
భారీ పేలుడుతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. మృతుల కుటుంబాలకు రూ.రెండు లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి రూ.50వేలు, స్వల్పంగా గాయపడిన కార్మికులకు రూ.25వేల నష్టపరిహారాన్ని యూపీ సీఎం మంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్పందిస్తూ ఇది చాలా భయానకమైన, దురదృష్టకర సంఘటన అని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.
 
కాగా, ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ఈ ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే, ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం ఉదయమే రాయ్‌బరేలికి వచ్చారు. అక్కడ హాస్పిటల్‌లో చికిత్సపొందుతున్న వారిని ఆయన పరామర్శించారు. ఈ ప్రమాదంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments