Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూట్యూబ్‌ చూసి స్వయంగా అబార్షన్.. ఏడు నెలల గర్భాన్ని..?

Webdunia
సోమవారం, 27 సెప్టెంబరు 2021 (15:08 IST)
కామాంధుని చేతిలో అత్యాచారానికి గురైన యువతి (24) ఓ తెలివితక్కువ పనిచేసింది. అతని కారణంగా గర్భం దాల్చిన విషయం ఎవరికైనా తెలిస్తే పరువు పోతుందని యూట్యూబ్‌లో చూసి స్వయంగా అబార్షన్ చేసుకుంది. 
 
ఇంటిలో ఎవరూ లేని సమయంలో చూసి యూట్యూబ్‌లో అబార్షన్‌కు సంబంధించిన వీడియోను చూసింది. దానిలో చెప్పినట్లు ఇంట్లో అందుబాటులో ఉన్న పరికరాల ఉపయోగించి తనకు తాను గర్భం ఏడు నెలల గర్భాన్ని బలవంతంగా తొలగించుకుంది. ఫలితంగా ఒక మృతశిశువుకు జన్మనిచ్చింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని నాగపూర్‌లో చోటుచేసుకుంది.
 
యువతి అబార్షన్‌కు వాడిన పరికరాల వల్ల ఆమె శరీరానికి ఇన్షెక్షన్ సోకడంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కుటుంబ సభ్యులు అసలు విషయం గురించి ఆరా తీయగా.. ఆమెపై అత్యాచారం జరిపిన వ్యక్తే అమెను అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేశాడని తెలిసింది. అతనికి అప్పటికే వివాహం కావడంతో పాటు ఒక కుమారుడు కూడా ఉన్నాడని తెలిసి షాకయ్యారు.
 
ఆ తర్వాత కుటుంబ సభ్యుల సహాయంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2016 నుంచి తాను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నానని, అప్పటినుంచి పలుమార్లు తనను శారీకరంగా కలిశాడని తెలిపింది. 
 
ఈ నేపథ్యంలోనే గర్భవతిని అయ్యానని, అయితే తనను అబార్షన్ చేయించుకోవాలని అతను ఒత్తిడి చేశాడని, పెళ్లి చేసుకునేందుకు కూడా నిరాకరించాడని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడు సోహెల్ వాహబ్ ఖాన్‌ను అత్యాచార ఆరోపణలపై అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments