Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 గంటల్లో 24,712 కొత్త కరోనా కేసులు..312 మరణాలు

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (12:14 IST)
దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడిలోనే ఉన్నట్లు మంత్రిత్వశాఖ గణాంకాలు వెల్లడిచేస్తున్నాయి. బుధవారం 10,39,645 వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 24,712మందికి పాజిటివ్‌గా తేలింది. అంతకు ముందు రోజుతో పోల్చుకుంటే 3 శాతం అధికంగా కేసులు నమోదయ్యాయి. జనవరి 30న తొలికేసు వెలుగుచూసిన దగ్గరి నుంచి 1,01,23,778 మంది వైరస్ బారిన పడ్డారు.
 
ఇక క్రియాశీల కేసుల సంఖ్య 2,83,849గా ఉండగా.. ఆ రేటు 2.80 శాతానికి చేరింది. నిన్నటితో 96,93,173 (95.75శాతం) మంది కొవిడ్‌-19 నుంచి కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో 312 మంది మరణించగా.. ఇప్పటి వరకు ఈ మహమ్మారికి 1,46,756 మంది బలయ్యారు.

డిసెంబర్ 1 నుంచి 22వరకు వారాల వ్యవధిలో మొదటి ఐదు రాష్ట్రాల్లో క్రియాశీల కేసుల్లో చోటుచేసుకున్న మార్పును మంత్రిత్వశాఖ ట్వీట్ చేసింది. ఆ రాష్ట్రాల జాబితాలో కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఉత్తర్‌ ప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌ ఉండగా.. మహారాష్ట్రలో క్రియాశీల కేసుల్లో భారీ తగ్గుదల కనిపించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments