Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లి ముందే సొంత అక్కపై అత్యాచారం.. అడ్డొచ్చిందని?

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (12:08 IST)
కామంతో రగిలిపోతున్న వ్యక్తి వావివరసలు మర్చిపోయాడు. ఒకే కడుపున పుట్టిన అక్కపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వద్దురా తప్పు అని చెబుతున్న అమ్మను అతి దారుణంగా గాయపరిచాడు. సభ్యసమాజం తలదించుకునేలా జరిగిన ఈ సంఘటన మహారాష్ట్ర్రలో జరిగింది.
 
పింప్రి చించ్వాడ్ పరిధిలోని భోసారి ఏరియాకి చెందిన ముఫై మూడేళ్ల మహిళకు వివాహం జరిగి భర్తతో విభేదించి పుట్టింట్లోనే ఉంటోంది. తమ్ముడు హేమంత్ డిగ్రీ పూర్తి చేసి ఇంటి పట్టునే ఉండేవాడు. ఆర్థికంగా చితికిపోయిన కుటుంబం. హేమంత్ తల్లి పానీపూరి బండితో జీవితాన్ని వెల్లదీస్తోంది.
 
అయితే హేమంత్ డిగ్రీ చదివేటప్పటి నుంచి మద్యానికి బానిసయ్యాడు. డ్రగ్స్ కు అలవాటుపడ్డాడు. స్నేహితులతో కలిసి తిరుగుతూ జైలుకు కూడా వెళ్లొచ్చాడు. ఎన్నోసార్లు తల్లి మారమని కొడుకును ప్రాథేయపడింది. అయినా అతనిలో మార్పు రాలేదు. 
 
మూడునెలల క్రితం భర్తతో విబేధించి ఇంటికి వచ్చేసింది హేమంత్ అక్క. అయితే డ్రగ్స్‌కు అలవాటు పడ్డ హేమంత్ రెండురోజుల క్రితం మద్యం మత్తులో అక్కపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. నిద్రలేచిన తల్లి హేమంత్‌ను అడ్డుకునే ప్రయత్నం చేసింది. 
 
దీంతో ఇంట్లోని రోకలిబండతో తల్లి నెత్తిపై కొట్టాడు హేమంత్. తల్లి రక్తపుమడుగులో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. అక్క నోట్లో గుడ్డలు కుక్కి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత ఇంటి నుంచి పరారయ్యాడు. ఉదయాన్నే గుర్తించిన స్థానికులు హేమంత్ తల్లిని ఆసుపత్రిలో చేర్పించారు . ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments