Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను కారులో కాళ్లూచేతులు కట్టేసి... భార్యపై గ్యాంగ్ రేప్.. ఎక్కడ?

మహారాష్ట్రలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్త కన్నెదుటే భార్యపై గ్యాంగ్ రేప్ జరిగింది. భర్తను కాళ్లూ చేతులు కట్టిసి కారులో పడేసి.. ఆ తర్వాత ఆయన ముందే 20 యేళ్ళ భార్యపై పలువురు కామాంధులు సామూహిక అత్యాచా

Webdunia
శుక్రవారం, 3 ఆగస్టు 2018 (10:23 IST)
మహారాష్ట్రలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్త కన్నెదుటే భార్యపై గ్యాంగ్ రేప్ జరిగింది. భర్తను కాళ్లూ చేతులు కట్టిసి కారులో పడేసి.. ఆ తర్వాత ఆయన ముందే 20 యేళ్ళ భార్యపై పలువురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు 8 నెలల గర్భిణి అయినప్పటికీ నిందితులు కరుణించలేదు. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... సతారా జిల్లాలో ఈ జంట ఓ హోటల్‌ను నిర్వహిస్తోంది. ఈ హోటల్‌లో పనిచేసేందుకు ఇధ్దరు అవసరమయ్యారు. ఇంతలో ముకుంద్ మానే అనే నిందితుడు వీరిని సంప్రదించాడు. ఇక్కడి తుర్చిఫాటా ప్రాంతంలో ఓ జంట పనిచేసేందుకు సిద్ధంగా ఉందనీ, రూ.20 వేలు అడ్వాన్స్ తీసుకుని రావాలని చెప్పాడు. 
 
దీంతో భార్యతో కలసి హోటల్ యజమాని తుర్చిఫాటాకు వెళ్లాడు. అక్కడే మరో 8 మంది నిందితులతో కలసి ముకుంద్ అతనిపై కర్రలు, రాడ్లతో దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడు. ఆ తర్వాత అతడిని కాళ్లూ చేతులు కట్టేసి కారులో పడేశారు. పిమ్మట ఆయన భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వీరివద్ద ఉన్న నగదు, బంగారం దోచుకుని పరారయ్యారు. అక్కడ నుంచి తప్పించుకుని వచ్చిన ఆ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం