Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో మళ్లీ లాక్డౌన్.. ఎందుకో తెలిస్తే నోరెళ్ళబెడతారు?

Webdunia
ఆదివారం, 14 నవంబరు 2021 (15:01 IST)
దేశ రాజధాని ఢిల్లీ మళ్లీ లాక్డౌన్‌లోకి వెళ్లనుంది. అయితే, ఈ దఫా కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్‌ను అమలు చేయడంలేదు. ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్యం కోరల నుంచి ప్రజలను కాపాడేందుకు లాక్డౌన్ విధించనున్నారు. వారం రోజుల పాటు లాక్డౌన్ విధిస్తారు. అలాగే, ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం, స్కూళ్లకు సెలవులు, నిర్మాణ పనుల నిలిపివేత వంటివి తీసుకున్నారు. 
 
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి లాక్డౌన్ తరహా నిబంధనలు విధించారు. వారం పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఆన్‌లైన్ ద్వారా పాఠాలు చెప్పేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే 17వ తేదీ భవన నిర్మాణ కార్యకలాపాలను కూడా నిలిపివేయాలని ఆదేశించారు. 
 
ఢిల్లీలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేయాలని ఆదేశించారు. లాక్డౌన్‌పై కూడా ఆలోచిస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ చర్యల వల్ల వాహనాల రద్దీ తగ్గి కాలుష్యం తగ్గే అవకాశం ఉండటంతో ఢిల్లీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. 
 
ప్రతీ ఏడాది దీపావళి తర్వాత ఢిల్లీ కాలుష్యమయం అయిపోతుంది. ఈ సారి కూడా అదే పరిస్థితి. కొద్ది రోజులుగా  పెరుగుతున్న కాలుష్యంతో ఢిల్లీ వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500 పాయింట్లను దాటిపోయింది. దీంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమయింది. 
 
సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు దాఖలయ్యాయి.  ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వాయు నాణ్యత క్షీణించడంతో ప్రజలు ఇంట్లో కూడా మాస్కులు ధరించాల్సి వస్తోందని చీఫ్ జస్టిస్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కానివ్వండి.. మీ ప్రణాళిక ఏంటో తెలియచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 
 
సుప్రీం ఆదేశాలు వెలువడిన గంటల్లోనే సీఎం కేజ్రీవాల్ కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500 నుంచి 200 కు తగ్గేలా ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత శోభిత కంటే ఏడురెట్లు ఆ విషయంలో బలంగా వుందట!?

Allu Arjun Pressmeet, సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్

పుష్ప 2: ది రూల్ హెచ్‌డీ ప్రింట్ లీక్.. పుష్ప-3పై బన్నీ దృష్టి పెడతాడా?

పవన్ కళ్యాణ్ ప్రశంస చాలా బలాన్నిచ్చింది : అనన్య నాగళ్ల

బరోజ్ 3డీ లాంటి సినిమా నలభై ఏళ్ళుగా రాలేదు : మోహన్ లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments