Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా టీచర్‌తో సంబంధం.. వద్దన్నందుకు తల్లిని చంపేసిన యువతి.. ఎక్కడ?

స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా ప్రభావంతో యువత పెడదోవ పడుతున్నారు. తాము అనుకున్నది సాధించుకోవడం కోసం తల్లిదండ్రులను క్షోభ పెడుతున్నారు. ఇలాంటి ఘటనే యూపీలోని ఘజియాబాద్‌లో ఓ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి మరో య

Webdunia
సోమవారం, 12 మార్చి 2018 (16:05 IST)
స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా ప్రభావంతో యువత పెడదోవ పడుతున్నారు. తాము అనుకున్నది సాధించుకోవడం కోసం తల్లిదండ్రులను క్షోభ పెడుతున్నారు. ఇలాంటి ఘటనే యూపీలోని ఘజియాబాద్‌లో ఓ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి మరో యువతితో అఫైర్ పెట్టుకుంది. ఈ అఫైర్‌ను సదరు యువతి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో.. చివరికి తల్లినే ఆ యువతి హతమార్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. మహిళా టీచర్‌తో సంబంధం పెట్టుకోవద్దని తల్లి హెచ్చరించడంతో 18ఏళ్ల యువతి ఈ నెల 9న 38 ఏళ్ల తల్లిని కర్ర, ఇనుప రాడ్డుతో బలంగా కొట్టి హతమార్చింది. మహిళా టీచర్‌తో కలిసి వుండటానికి నిందితురాలి తల్లిదండ్రులు అనుమతించకపోవడంతో తల్లిని చంపి పారిపోదామనుకుంది. ఈ ఘటనపై నిందితురాలిపై తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తల్లిని హతమార్చిన యువతిని అరెస్ట్ చేశారు. అలాగే నిందితురాలైన యువతితో సంబంధం పెట్టుకున్న టీచర్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
 
ఈ ఘటనపై నిందితురాలి తండ్రి మాట్లాడుతూ.. మహిళా టీచర్‌తో కలిసి జీవించేందుకు 18ఏళ్ల తన కుమార్తె (నిందితురాలు) ఇంటి నుంచి రెండు నెలల ముందే పారిపోయిందని.. మైనర్ కావడంతో ఇంటికి తీసుకొచ్చామని చెప్పారు. అయితే ఇంత దారుణానికి ఒడిగడుతుందని తాను భావించలేదని తండ్రి వాపోయాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments