Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమికుడి బర్త్ డే పార్టీకి ఇంటికి గొళ్లెం పెట్టి వెళ్లింది.. చివరికి గ్యాంగ్ రేప్

Webdunia
సోమవారం, 7 జూన్ 2021 (13:23 IST)
నిర్భయలాంటి కఠిన చట్టాలు వచ్చినా.. కామాంధుల్లో మార్పు రావడం లేదు. నిత్యం ఏదో ఒక చోట అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు మాయ మాటలు చెప్పి దారుణాలకు ఒడిగడుతున్నారు. ముంబైలో దారుణం జరిగింది.

బాయ్‌ఫ్రెండ్‌ని నమ్మి బర్త్​డే పార్టీకి వెళ్లిన ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. నార్త్​ ముంబైలోని మల్వానీలో ఈ ఘోరం చోటుచేసుకుంది. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఆరుగురిని స్థానిక పోలీసులు అరెస్ట్​ చేశారు.
 
వివరాల్లోకి వెళితే. నార్త్​ ముంబైలో జరిగిన ప్రియుడు పుట్టినరోజుకు యువతి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. వెళ్లే సమయంలో తనను ఎవరూ అడ్డుకోకుండా ఇంటికి గొళ్లెం పెట్టింది. ప్రియుడి బర్త్​డే పార్టీకి చేరుకుంది. అక్కడ అతని స్నేహితులు, అతను కలిసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రెండు రోజుల తర్వాత ఆమెకు కడుపులో నొప్పిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పింది. 
 
అనంతరం తనపై జరిగిన బలాత్కారం గురించి, నిందితుల గురించి వివరించింది. దీనిపై పోలీస్​స్టేషన్​లో కేసు నమోదైంది. ఆరుగురిని పట్టుకున్న పోలీసులు.. మరొకరి కోసం గాలిస్తున్నారు. గ్యాంగ్ రేప్ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం