Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ వారంలో 15 మంది పాక్ రేంజర్లను కాల్చిపారేశాం : బీఎస్ఎఫ్

యురీ ఉగ్రదాడి తర్వాత భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివున్నాయి. దీంతో ఇరు దేశాల సైనిక బలగాలు కాల్పులకు తెగబడుతున్నాయి. ఈ హోరాహోరీ కాల్పుల్లో గత వారం రోజుల్లో 15 మంది పాక

Webdunia
శనివారం, 29 అక్టోబరు 2016 (08:47 IST)
యురీ ఉగ్రదాడి తర్వాత భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివున్నాయి. దీంతో ఇరు దేశాల సైనిక బలగాలు కాల్పులకు తెగబడుతున్నాయి. ఈ హోరాహోరీ కాల్పుల్లో గత వారం రోజుల్లో 15 మంది పాక్‌ రేంజర్లను కాల్చిపారేసినట్టు భారత సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) ప్రకటించింది. పాక్‌ బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారత పౌరులు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడినట్లు తెలిపింది. 
 
అదేసమయంలో జమ్మూకాశ్మీర్‌లోని జమ్ము, కథువా, పూంఛ్‌, రాజౌరి జిల్లాల్లోని అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి గురువారం అర్థరాత్రి నుంచి పాక్‌ బలగాలు పెద్ద ఎత్తున కాల్పులను ప్రారంభించాయి. నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని విరుచుకుపడ్డాయి. శుక్రవారం ఉదయం వరకు కాల్పులు కొనసాగాయి. పాక్‌ కవ్వింపు చర్యలకు భారత బలగాలు ధీటుగా జవాబిచ్చాయి. 
 
ఇదిలావుండగా, జమ్మూకాశ్మీర్‌లోని కుల్గామ్‌ జిల్లాలో ఐదుగురు అనుమానిత లష్కరే తాయిబా ఉగ్రవాదులు సహా ఓ పోలీసును భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. మరోపక్క, 'స్వాతంత్ర సమరం మరింత ముందుకు' అంటూ లష్కరే ప్రకటనలు కనిపించాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏప్రిల్ లో ఎర్రచీర - ది బిగినింగ్ డేట్ ఫిక్స్

తల్లి అంజనా దేవి ఆరోగ్యం పై మెగా స్టార్ చిరంజీవి వివరణ

లెవెన్ నుంచి ఆండ్రియా జర్మియా పాడిన ఇక్కడ రా సాంగ్ రిలీజ్

మజాకా నుంచి సొమ్మసిల్లి పోతున్నావే జానపద సాంగ్ రిలీజ్

కృష్ణ గారు రియల్ సూపర్ స్టార్. విజయ నిర్మల ఆడపులి : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

దుబాయ్-ప్రేరేపిత క్యాప్సూల్ కలెక్షన్‌ ప్రదర్శన: భారతీయ కోటూరియర్ గౌరవ్ గుప్తాతో విజిట్ దుబాయ్ భాగస్వామ్యం

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

తర్వాతి కథనం
Show comments