ఇరాన్‌లో కూలిన కాలం చెల్లిన విమానం : 15 మంది మృత్యువాత

Webdunia
మంగళవారం, 15 జనవరి 2019 (14:40 IST)
ఇరాన్‌లో కాలం చెల్లిన సైనిక విమానానికి ఒకటి ప్రమాదానికి లోనైంది. ఈ ప్రమాదంలో 15 మంది మృత్యువాతపడ్డారు. ప్రతికూల వాతావరణంలో రన్‌వేపై దిగిన ఈ మిలిటరీ కార్గో విమానం అదుపుతప్పి సమీపంలోని భవన సముదాయంలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 15 మంది చనిపోయారు. ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. 
 
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు సమీపంలోని ఫత్ విమానాశ్రయంలో ఈ ప్రమాదం జరిరగింది. ప్రమాద సమయంలో విమానంలో 16 మంది ఉన్నట్లు ఆర్మీ అధికారులు చెప్పారు. సాహా ఎయిర్‌లైన్స్‌కు చెందిన మిలిటరీ కార్గో విమానం బోయింగ్ 707 కిర్గిస్థాన్‌లోని బిష్కెక్ పట్టణం నుంచి మాంసాన్ని తీసుకుని బయలుదేరింది. 
 
టెహ్రాన్‌కు పశ్చిమాన 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాయమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్గో విమానం దిగాల్సి ఉంది. అయితే, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పైలట్ అత్యవసరంగా అల్‌బోర్జ్ ప్రావిన్సులోని ఫత్ విమానాశ్రయంలో దించాడు. రన్‌వే పై దిగుతున్న క్రమంలో విమానం అదుపుతప్పి పూర్తిగా ఓ పక్కకు ఒరిగిపోవడంతో ఈ ప్రమాదం వాటిల్లింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments