Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు షాక్ : వైసీపీలోకి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే

Webdunia
మంగళవారం, 15 జనవరి 2019 (14:30 IST)
సంక్రాంతి సంబరాల కోసం తన స్వగ్రామం నారావారి పల్లెకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఒకరు తేరుకోలేని షాకివ్వనున్నారు. రాజంపేటకు చెందిన టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి అధికార పార్టీకి రాజీనామా చేసి వైకాపాలో చేరాలన్న యోచనలో ఉన్నట్టు సమాచారం. 
 
గత కొంతకాలంగా పార్టీ అధినేత చంద్రబాబుపై మల్లిఖార్జున రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అలాగే, స్థానిక టీడీపీ నేతలు కూడా ఆయనకు ఏమాత్రం సహకరించడం లేదు. దీంతో ఆయన రెడ్డి సామాజికవర్గం అధికంగా ఉండే వైకాపాలో చేరేందుకు ఆయన నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఆయన ఈనెలాఖరులో టీడీపీకి రాజీనామా చేసి జగన్ చెంతకు చేరాలని భావిస్తున్నట్టు సమాచారం. 
 
ఇదే అంశంపై వైకాపా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డితో మంతనాల తర్వాత మేడా మల్లిఖార్జునరెడ్డి పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చారని ప్రచారం సాగుతోంది. రాజంపేట వైసీపీ నేతలతోనూ ఆయన సంప్రదింపులు జరిపినట్టు సమాచారం అందుతుండగా... పార్టీ మారేందుకు ఆయన కుటుంబ సభ్యులు సుముఖంగానే ఉన్నారంటున్నారు. అయితే, తనకు పార్టీలో సరైన ప్రాధాన్యత ఉండటంలేదని కొంత కాలంగా మేడా మల్లిఖార్జునరెడ్డి అసంతృప్తి ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments