Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బాయిని అమ్మాయిగా మార్చి.. ఆరు నెలల పాటు..?

Webdunia
శనివారం, 16 జనవరి 2021 (09:27 IST)
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలుడికి బలవంతంగా లింగ మార్పిడి చేశారు. ఆపై నలుగురు దుండగులు మూడేళ్ల పాటు లైంగిక దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ, లక్మీనగర్‌లో జరిగిన డ్యాన్స్‌ కార్యక్రమంలో పరిచయమైన ఒక వ్యక్తి, శిక్షణ ఇస్తానని చెప్పి ఆ బాలుడ్ని తన వెంట తీసుకెళ్లాడు. అనంతరం ఆ బాలుడితో కొన్ని డ్యాన్స్‌ కార్యక్రమాలు ఇప్పించి డబ్బులు సంపాదించాడు.
 
అయితే తన బృందంతో కలిసి డ్యాన్స్‌ చేసి జీవిస్తానని ఆ బాలుడు ఒక రోజు అతడితో చెప్పాడు. దీంతో ఆ వ్యక్తి ఆ బాలుడ్ని నిర్బంధించి కొన్ని రోజులు మత్తుపదార్థాలు ఇచ్చాడు. అనంతరం బలవంతంగా లింగ మార్పిడి ఆపరేషన్‌ చేయించాడు. హార్మోన్‌ ఇంజక్షన్లు కూడా ఇవ్వడంతో ఆ బాలుడి శరీరంలో మార్పులు సంభవించాయి.
 
అనంతరం ఆ వ్యక్తి , ముగ్గురు స్నేహితులు కలిసి కొన్ని ఏళ్లుగా బాలుడిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద యాచించాలని డిమాండ్‌ చేశారు. ఆ వ్యక్తి కూడా మహిళల దుస్తులు ధరించి రోడ్డుపై కనిపించే వారి నుంచి డబ్బులు డిమాండ్‌ చేసేవాడు. కొన్ని రోజుల తర్వాత బాధిత బాలుడికి తెలిసిన మరో బాలుడ్ని ఆ వ్యక్తి తీసుకొచ్చాడు.
 
కాగా, గత ఏడాది మార్చిలో కరోనా లాక్‌డౌన్‌ సమయంలో వీరిద్దరు పారిపోయారు. ఢిల్లీ రైల్వే స్టేషన్‌కు వెళ్లి దాక్కున్నారు. ఓ న్యాయవాది సాయంతో ఢిల్లీ మహిళా కమిషన్‌ (డీసీడబ్ల్యూ)కు అప్పగించారు. అలా ఆ ఇద్దరు కామాంధుల చెర నుంచి బయటపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna :డాకూ మహారాజ్ లో మోక్షజ్న ? డాకూ మహారాజ్ కు పార్ట్ 2 వుంటుందా?

మెస్మరైజ్ చేస్తున్న ఉన్ని ముకుందన్ మలయాళ చిత్రం మార్కో

పోరాటాలకు విరామం ఉండ‌ద‌నే కాన్సెఫ్టుతో దక్కన్ సర్కార్ మూవీ

జూనియర్ ఎన్టీఆర్ మాట తప్పారంటూ అభిమాని తల్లి వ్యాఖ్యలు

Sreeleela: బాలీవుడ్ ఐటమ్ సాంగ్‌కు ఓకే చెప్పిందా? ఐటమ్ గర్ల్‌గా శ్రీలీల ఎంట్రీ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం