బీహార్‌లో దారుణం .. జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు...

Webdunia
సోమవారం, 21 నవంబరు 2022 (11:44 IST)
బీహార్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 12 మంది మృత్యువాతపడ్డారు. మరికొందరు గాయాలపాలయ్యారు. ఈ ఘటన వైశాలి జిల్లాలోని మన్హార్‌లో ఆదివారం రాత్రి జరిగింది. 
 
ఓ పూజా కార్యక్రమాన్ని తిలకించేందుకు స్థానికులు భారీ సంఖ్యలో నిలబడివున్నారు. వారిపైకి వేగంగా వచ్చిన ఓ ట్రక్కు నియంత్రణ కోల్పోయి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 12 మంది ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ ప్రమాదంపై బిహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments