Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూతపడనున్న పురాతన రైల్వే లైను

Webdunia
గురువారం, 13 ఫిబ్రవరి 2020 (14:47 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ధుధ్వా నేషనల్ పార్క్ మీదుగా వెళ్లే 109 ఏళ్ల పురాతన రైల్వే లైను మూతపడనుంది. నాన్‌పారా - మైలానీ మధ్య నడిచే 171 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గం అడవుల మధ్య నుంచి సాగుతుంది. లఖీంపూర్ - మైలానీ బ్రాడ్ గేజ్ మార్గం ఈ నెలాఖరుకు ప్రారంభం కానుంది. తర్వాత నాన్‌పారా - మైలానీ రైలు మార్గం మూతపడనుంది. అటవీ జంతువులు, అటవీ సంరక్షణ దృష్ట్యా సుప్రీం కోర్టు జారీచేసిన ఆదేశాల మేరకు నాన్‌పారా - మైలానీ రైలు మార్గాన్ని మూసివేయనున్నారు. 
 
ఈ సందర్భంగా రైల్వే అధికారి ఒకరు మాట్లాడుతూ తాము ధువాన్ వచ్చే ప్రయాణికుల కోసం ఒక టాయ్‌ట్రైన్ ప్రారంభిస్తామని, దానివలన అటవీ జంతువులకు ఎటువంటి ప్రమాదం వాటిల్లదని తెలిపారు. కాగా ధుధ్వా టైగర్ రిజర్వ్‌కు చెందిన అధికారి సంజయ్ పాఠక్ మాట్లాడుతూ గత 20 ఏళ్లలో ఈ ప్రాంతంలో చోటు చేసుకున్న రైలు ప్రమాదాల్లో వందకు మించి జంతువులు మృతి చెందాయని అన్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments