Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలోనే తొలి ట్రాన్స్‌‌జెండర్‌‌ వర్సిటీ

Advertiesment
దేశంలోనే తొలి ట్రాన్స్‌‌జెండర్‌‌ వర్సిటీ
, గురువారం, 26 డిశెంబరు 2019 (12:17 IST)
దేశంలోనే తొలిసారి ట్రాన్స్‌‌జెండర్ల కోసం ప్రత్యేకంగా ఓ యూనివర్సిటీ ఏర్పాటవబోతోంది. ఉత్తరప్రదేశ్‌‌లోని కుషినగర్‌‌ జిల్లాలో ఆలిండియా ట్రాన్స్‌‌జెండర్‌‌ ఎడ్యుకేషన్‌‌ సర్వీస్‌‌ ట్రస్టు (ఏఐటీఈఎస్‌‌టీ) దీన్ని నిర్మించనుంది. వర్సిటీ కోసం ఇప్పటికే పని మొదలైందని, ఒకటో తరగతి నుంచి పీజీ వరకు ఇక్కడ చదువుకోవచ్చని, పీహెచ్‌‌డీ కూడా చేయొచ్చని ట్రస్టు ప్రెసిడెంట్‌‌ కృష్ణ మోహన్‌‌ మిశ్రా చెప్పారు. 
 
కమ్యూనిటీ మెంబర్లు పెంచుకుంటున్న ఇద్దరు చిన్నారులు వచ్చే ఏడాది జనవరి 15న వర్సిటీలో ఫస్ట్‌‌ అడ్మిషన్‌‌ తీసుకుంటారని.. ఫిబ్రవరి, మార్చి నుంచి క్లాసులు మొదలవుతాయని తెలిపారు.
 
వర్సిటీ వల్ల ట్రాన్స్‌‌జెండర్‌‌ కమ్యూనిటీ చదువుకునే అవకాశాలు పెరుగుతాయని, వీళ్లు విద్యావంతులై దేశానికి కొత్త దారి చూపించగలుగుతారని ఎమ్మెల్యే గంగాసింగ్‌‌ అన్నారు. 
 
వర్సిటీ ఏర్పాటుపై ట్రాన్స్‌‌జెండర్‌‌ కమ్యూనిటీ కూడా సంతోషం వ్యక్తం చేసింది. ‘వర్సిటీతో మా లైఫ్‌‌ మారిపోతుంది. చదువుతో మాక్కూడా సొసైటీలో గౌరవం పెరుగుతుంది’ అని ఆ కమ్యూనిటీ మెంబర్‌‌ గుడ్డి కిన్నార్‌‌ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నడిరోడ్డుపై మద్యం మత్తులో మహిళ చీర లాగేసిన యువకులు