Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరట్‌లో విషాదం.. శిథిల భవనం కూలి పది మంది మృత్యువాత

ఠాగూర్
సోమవారం, 16 సెప్టెంబరు 2024 (12:26 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. శిథిలావస్థకు చేరిన ఓ భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో పది మృత్యువాతపడ్డారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారు.
 
మీరట్‌లోని స్థానిక జకీర్ కాలనీలో ఉన్న ఈ భవనం 50 ఏళ్ల నాటిది. శిథిల పరిస్థితుల్లో ఉన్న భవనం గత సాయంత్రం ఒక్కసారిగా కుప్పకూలింది. భవనం కింద ఓ డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు. ఈ ఘటనలో ఒక కుటుంబం మొత్తం సమాధి అయిపోయింది. కొన్ని పశువులు మృత్యువాత పడ్డాయి.
 
సమాచారం అందుకున్న వెంటనే జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాలు, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఒక పక్క వర్షం పడుతుండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. స్థానిక వలంటీర్లు కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు. 
 
అర్ధరాత్రి 2 గంటల వరకు శిథిలాలు తొలగించగా, ఈ ఉదయం మళ్లీ ప్రారంభమయ్యాయి. కూలిన భవనం ఇరుకు ప్రదేశంలో ఉండడంతో బుల్డోజర్లు అక్కడి వెళ్లలేకపోతున్నాయని పోలీసులు తెలిపారు.
 
తీవ్రంగా గాయపడిన ఐదుగురిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించామని, వారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. మృతులను ఒకే కుటుంబానికి చెందిన నఫీసా (63), ఫర్హానా (20), అలీసా (18), సాజిద్ (40), సానియా (15), సాఖిబ్ (11), సిమ్రన్ (15 నెలలు), ఆలియా (6), రిజా (7), రిమ్సా (5 నెలలు) గా గుర్తించారు. భవనం కూలిన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments