మహారాష్ట్రలో కోవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం - 10 మంది సజీవదహనం

Webdunia
శనివారం, 6 నవంబరు 2021 (14:10 IST)
మహారాష్ట్రలోని అహ్మద్ నగర్‌ కోవిడ్ ఆస్పత్రిలో శనివారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కనీసం 10 మంది కోవిడ్ రోగులు మృత్యువాతపడ్డారు. మరికొందరు గాయపడ్డారు. 
 
అహ్మద్‌నగర్‌లోని కొవిడ్‌ ఆస్పత్రి ఐసీయూలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. మంటల ధాటికి బయటకు రాలేక చిక్కుకుపోయిన కనీసం 10 మంది కరోనా పేషెంట్స్‌ సజీవదహనమయ్యారు.
 
అగ్నిప్రమాదంలో గాయపడిన మరో 11మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్‌ సిబ్బందితో సహా వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
 
ప్రస్తుతం ఆ ఆస్పత్రిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నట్లు సిబ్బంది చెబుతున్నారు.
 
అటు, జమ్ముకశ్మీర్‌లో వరుస అగ్నిప్రమాదాలు..ఎస్‌. ఉవ్వెత్తున మంటలు ఎగసిపడ్డాయి. జమ్ముకశ్మీర్‌ కిష్త్వార్‌లో 3 అంతస్తుల భవనంలో ఫైర్‌ యాక్సిడెంట్‌ జరిగింది. పెద్ద ఎత్తున చెలరేగిన మంటలకు ఆ భవనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూటే కారణమని అనుమానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments