డేటింగ్ సమయంలో అమ్మాయిలు తీసుకోవలసిన జాగ్రత్తలు

Webdunia
శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (12:10 IST)
స్నేహం, ప్రేమ ఇలా ఏ బంధమైనా ఎక్కువగా ప్రభావితమయ్యేది అమ్మాయిలే. ఒకవేళ ఆ బంధం బలపడితే సరికానీ.. తెగిపోతే మాత్రం అమ్మాయిలే నష్టపోతారన్నది సత్యం. ఏ విషయంలోనైనా మగవాళ్ళు నష్టపోవడం చాలా తక్కువ. 
 
ఎవరో సున్నితమనస్కులైతే తప్ప ఇలాంటి బ్రేకప్స్‌ను అబ్బాయిలు ఈజీగానే తీసుకుంటున్నారు. అసలీ బ్రేకప్స్ రావాల్సిన పనేముంది? డేటింగ్‌కు ముందే జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. డేటింగ్‌కు ముందు అమ్మాయిలు ఎలా జాగ్రత్తపడాలంటే.. 
 
* మీరు డేటింగ్‌కు ఎంచుకోవాలనుకునే అబ్బాయి.. కొత్త ప్రయత్నాలు చేయకుండా... అన్నీ ఏకపక్షంగా చర్యలకే ప్రాధాన్యమిస్తుంటే అలాంటి వ్యక్తిని దూరంగా పెట్టండి. లేదంటే ప్రమాదమే.
 
* మీరు వారి బానిసలుగా తలచుకుంటే అంటే అమ్మాయిలు వంటింటికే పరిమితం అనే చందంగా మాట్లాడే అస్సలు వారి జోలికే పోకూడదు.  
 
* ఎప్పుడూ తాము కొన్న వస్తువుల ధరలు, హోటల్ తిండి ఖర్చులు గురించి పదేపదే ప్రస్తావించేవారితో చాలా కష్టం. డేటింగ్ చేసినన్నాళ్ళూ వీరు మరింత పిసినారితనంతో ప్రవర్తిస్తారన్నదానికి అవి సంకేతాలు. 
 
* స్పోర్ట్స్ చూసేందుకు అత్యధిక ప్రాధాన్యమిచ్చే అబ్బాయిలు... ఓ అనుబంధం పట్ల, కుటుంబం పట్ల నిర్వర్తించాల్సిన బాధ్యతలను ఎన్నడూ పట్టించుకోరు. ఇవన్నీ, వారు బాల్య పోకడల నుంచి బయటపడలేదన్న విషయాన్ని సూచిస్తాయి.
 
* అన్నిటికంటే ముఖ్యంగా, ప్రతి క్షణం నిఘా వేసే వ్యక్తికి దూరంగా ఉండాలి. బయటికెళితే ఎవరితో తిరుగుతోంది? ఏంచేస్తోంది? వంటి అనుమానాలతో వేగిపోయే మగవాణ్ణి ఎంతదూరం పెడితే అంతమంచిది. 
 
* బంధం పట్ల అవగాహన లేకుండా, చపలచిత్తం ప్రదర్శిస్తుంటారు కొందరు. ఓసారి అనుబంధం కొనసాగించాలని, మరోసారి పిల్లలు కావాలని అంటుంటారు... రెణ్నెల్ల తర్వాత, అసలేదీ తేల్చుకోలేకపోతారు. వీరితోనూ జాగ్రత్తగా ఉండాలని మానసిక నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

2,500 కిలోమీటర్ల వ్యాసార్థంలో విస్తరించి ఉన్న భారీ మేఘాల సమూహం, ఏం చేయబోతోంది?

నెల్లూరులో 1000 మంది నివాసితులకు వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ సురక్షిత తాగునీటి సదుపాయం

కర్నాటక నుంచి రాజ్యసభకు వైఎస్ షర్మిల?

ఆస్తి వివాదం.. కుటుంబానికి చెందిన ఐదుగురి హత్య ... ఎక్కడ?

ఇక అమెరికా ఏం గెలుస్తుంది? రూ.150 కోట్ల విమానాన్ని చిన్న బాణంతో కూల్చేసిన ఇరాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments