Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంత కారు లేని రాహుల్... ఆస్తులు ఎంతో తెలుసా?

ఠాగూర్
గురువారం, 4 ఏప్రియల్ 2024 (10:53 IST)
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సొంత కారు లేదు. సొంతంగా రెసిడెన్షియల్ ఫ్లాట్ కూడా లేదు. ఆయన ఆస్తి విలువ రూ.20 కోట్లు మాత్రమే. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. దీంతో బుధవారం ఆయన అక్కడ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో సొంత కారు, రెసిడెన్షియల్ ఫ్లాట్ వంటివి లేవని, తన ఆస్తి రూ.20 కోట్లని పేర్కొన్నారు. తన చేతిలో రూ.55 వేల నగదు, రూ.26.25 లక్షల బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్టు తెలిపారు. అలాగే, రూ.4.33 కోట్ల విలువ చేసే బాండ్లు, షేర్లు, రూ.3.81 కోట్ల మ్యూచువల్ ఫండ్స్, రూ.15.21 లక్షల బంగారు బాండ్లు, రూ.4.20 లక్షల విలువైన నగలు సహా రూ.9.24 కోట్ల చరాస్తులున్నట్టు అఫిడవిట్‌‍లో పేర్కొన్నారు. రాహుల్ రూ.11.15 కోట్ల స్థిరాస్తులు కలిగి ఉన్నారు. 
 
ఢిల్లీలోని మెహరౌలి ప్రాంతంలో సోదరి ప్రియాంకగాంధీతో కలిసి వ్యవసాయభూమి ఉంది. గురుగ్రామ్ రూ.9 కోట్లకుపైగా విలువైన ఆఫీస్ స్పేస్ ఉంది. వ్యవసాయ భూమి తనకు వారసత్వంగా వచ్చిందని రాహుల్ అఫిడవిట్లో పేర్కొన్నారు. అలాగే, అత్యాచార బాధిత కుటుంబ వివరాలను సోషల్ మీడియాలో బయటపెట్టినందుకు రాహుల్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. దీంతోపాటు బీజేపీ నేతల ఫిర్యాదుపై పరువునష్టం కేసులు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు సంబంధించి నేరపూరిత కుట్ర కేసు కూడా తనపై నమోదైనట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ వయనాడ్ నుంచి గెలుపొందారు. ఈసారి ఆయనకు ప్రత్యర్థులుగా సీపీఐ నేత అన్నీ రాజా, రాష్ట్ర బీజేపీ సుందరన్ బరిలో ఉన్నారు. కేరళలో ఈ నెల 26న ఎన్నికలు జరగనున్నాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

‘వికటకవి’ పీరియాడిక్ సిరీస్‌.. డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఖాయం: డైరెక్ట‌ర్ ప్ర‌దీప్ మ‌ద్దాలి

కార్తీ లుక్ దేనికి హింట్.. కంగువకు సీక్వెల్ వుంటుందా?

తాజా ఫ్యాషన్ ఫోటోషూట్‌లో శృతి హాసన్ అదుర్స్

గమ్మత్తయిన గాత్రం కోసం రమణ గోగులను రంగంలోకి దింపిన అనిల్ రావిపూడి

పుష్ప-2లో ఐటమ్ సాంగ్.. శ్రీలీల ఫీజెంత.. రష్మిక మందన్న ఎంత తీసుకుంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

వర్షాకాలం, శీతాకాలంలో మయొనైజ్ వాడకూడదట..

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

తర్వాతి కథనం
Show comments