ఏడు దశల్లో ఎన్నికలు -ఎలక్షన్ కోడ్ అమలు - దేశంలో 97 కోట్ల ఓటర్లు

SELVI.M
శనివారం, 16 మార్చి 2024 (16:39 IST)
EC
ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్, సిక్కిం, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్. ఎలక్షన్ షెడ్యూల్ రావడంతో నేటి నుంచే ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చింది.
 
ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు ఈ కోడ్ వర్తించనుంది. రాజకీయ పార్టీలు, నేతలు ఎలక్షన్ కోడ్‌ను తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కాగా.. ఆంధ్రప్రదేశ్ లో గత అసెంబ్లీ ఎన్నికలు 2019లో జరిగాయి. వైసీపీ ఘన విజయం సాధించగా టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. 
 
ఏడు దశల్లో పోలింగ్:
ఏప్రిల్ 19 - తొలిదశ ఎన్నికలు
ఏప్రిల్ 26 - రెండో దశ పోలింగ్
మే 7 - మూడో దశ పోలింగ్
మే 13 - నాలుగో దశ
మే 20 - ఐదో దశ పోలింగ్
మే 25 - ఆరో దశ పోలింగ్
జూన్ 1 - ఏడో దశ పోలింగ్
 
ఈ సందర్భంగా రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలో సుమారు 97 కోట్ల ఓటర్లు ఉన్నారన్నారు. వారిలో 49.7 మంది పురుషులు, 47.1 మహిళా ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. అందులో కోటి 80 లక్షల మంది కొత్త ఓటర్లు ఉండటం గర్వించదగిన విషయమని చెప్పారు. దేశవ్యాప్తంగా 10.5 లక్షల పోలింగ్ కేంద్రాలున్నాయని, ఎన్నికల విధుల్లో 1.5 కోట్ల మంది ఉద్యోగులు ఉన్నారని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments