మే 13న ఏపీలో ఎన్నికల పోలింగ్.. ఏప్రిల్ 19 నుంచి లోక్‌సభ పోలింగ్

ఠాగూర్
శనివారం, 16 మార్చి 2024 (16:35 IST)
దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగకు నగారా మోగింది. లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌కు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ సార్వత్రిక ఎన్నికలను మొత్తం ఏడు దశల్లో నిర్వహించనున్నారు. ఏప్రిల్ 19వ తేదీన తొలి విడత పోలింగ్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీతో పాటు 25 లోక్‌సభ స్థానాలకు మే 13వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ నాలుగో తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు. తెలంగాణాలో 17 లోక్‌సభ స్థానాలకు కూడా మే నెల 13వ తేదీనే పోలింగ్ నిర్వహిస్తారు. 
 
లోక్‌సభ ఎన్నికలు ఇలా... 
తొలి దశ : ఏప్రిల్ 19వ తేదీన 102 లోక్‌సభ స్థానాలకు (21 రాష్ట్రాలు) 
రెండో దశ : ఏప్రిల్ 26వ తేదీ, 89 ఎంపీ స్థానాలు (13 రాష్ట్రాలు) 
మూడో దశ : మే 7వ తేదీ, 94 స్థానాలు (12 రాష్ట్రాలు) 
నాలుగో దశ : మే 13వ తేదీ, 96 ఎంపీ స్థానాలు (10 రాష్ట్రాలు) 
ఐదో దశ : మే 20వ తేదీ, 49 స్థానాలు (8 రాష్ట్రాలు) 
ఆరో దశ : మే 25వ తేదీ, 57 స్థానాలు (7 రాష్ట్రాలు) 
ఏడో దశ : జూన్ 1వ తేదీ 57 స్థానాలు (8 రాష్ట్రాలు) 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Boyapati Srinu: ఇక్కడ కులాలు లేవు మతాలు లేవు. ఉన్నదంతా మంచి చెప్పడమే : బోయపాటి శ్రీను

Balakrishna:చరిత్రని సృష్టించేవాడు ఒకడే ఉంటాడు. నేనే ఈ చరిత్ర: నందమూరి బాలకృష్ణ

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments