Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరో దశలో అత్యంత ధనవంతుడు సింధియానే...

Webdunia
శనివారం, 4 మే 2019 (10:40 IST)
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలోభాగంగా, ఈనెల 12వ తేదీన ఆరో దశ పోలింగ్ జరుగనుంది. ఈ దశలో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో అత్యంత ధనవంతుడైన అభ్యర్థిగా జ్యోతిరాదిత్య సింధియా నిలిచాడు. ఈయన ఆస్తుల విలువ రూ.374 కోట్లు. పైగా, రాజస్థాన్ రాష్ట్రంలోని గుణ అసెంబ్లీ స్థానం నుంచి ఈయన పోటీ చేస్తున్నారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జిగా సింధియా వ్యవహరిస్తున్నారు. ఈ దశలో మొత్తం 967 మంది అభ్యర్థులు బరిలో ఉంటే.. అత్యంత ధనవంతుడు జ్యోతిరాదిత్య సింధియానే కావడం గమనార్హం. 
 
కాగా, పోటీలో ఉన్న ఇతర లోక్‌సభ అభ్యర్థుల్లో మాజీ క్రికెటర్, బీజేపీ అభ్యర్థి గౌతం గంభీర్ రెండో స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ రూ.147 కోట్ల కంటే ఎక్కువగా ఉంది. ఆరో దశలో పోటీ పడుతున్న 54 మంది బీజేపీ అభ్యర్థుల్లో 46 మంది.. 46 మంది కాంగ్రెస్ అభ్యర్థుల్లో 37 మంది, 49 మంది బీఎస్పీ అభ్యర్థుల్లో 31 మంది.. 12 మంది ఆప్ అభ్యర్థుల్లో ఆరుగురు.. 307 మంది ఇండిపెండెంట్ అభ్యర్థుల్లో 71 మంది ఆస్తుల విలువ రూ.కోటి కంటే ఎక్కువగా ఉంది. 
 
మొత్తమ్మీద చూస్తే ఆరో దశలో పోటీ చేస్తున్న అభ్యర్థుల సరాసరి ఆస్తుల విలువ రూ.3.41 కోట్లుగా ఉంది. 10 మంది అభ్యర్థులు తమకు చదువు రాదని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కాగా, ఆరో దశలో మొత్తం 59 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగనుండగా, 83 మంది మహిళలు బరిలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments