Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చేపలు పట్టేలా.. పాముల్ని పడుతున్న ప్రియాంక గాంధీ.. వీడియో వైరల్

Advertiesment
చేపలు పట్టేలా.. పాముల్ని పడుతున్న ప్రియాంక గాంధీ.. వీడియో వైరల్
, శుక్రవారం, 3 మే 2019 (11:48 IST)
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి సంబంధించి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ప్రియాంక గాంధీ చెరువు చేపలు పట్టేలా.. పాముల్ని పట్టేస్తున్నారు. ఈ వీడియోను చూసినవారంతా షాకవుతున్నారు. సాధారణంగా పాములంటే అందరూ జడుసుకుంటారు. అలాంటిది ఉత్తరప్రదేశ్ రాయ్‌బరేలీలో ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. 
 
ఈ సందర్భంగా తొలుత చిన్నారులతో రాయ్‌బరేలీలో ముచ్చటించిన ప్రియాంక గాంధీ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. మోదీ చౌకీదార్ కాదని, ఆయనో దొంగ అని కామెంట్స్ చేశారు. ఈ కామెంట్లకు చిన్నారుల చప్పట్లతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. ఆపై పాముల్ని ఆడిస్తూ జీవనం కొనసాగించే వారిని కలిశారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. 
 
ఈ క్రమంలో పాములోరి వద్ద వున్న పాములను బుట్ట నుంచి ఏమాత్రం భయం లేకుండా చేతులో పట్టుకున్నారు. ఈ సీన్‌ను చూసినవారంతా ప్రియాంక గాంధీ చెరువులో చేపలు పట్టినట్లు పాముల్ని పట్టేస్తుందే అని తెల్లబోయారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అజర్ మసూద్ ఆస్తులు చేయండి : పాకిస్థాన్ నోటిఫికేషన్