Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదావరి పుష్కర స్నానం చేశాం కదా...? కృష్ణా పుష్కర స్నానం కూడా చేయాలా...?

మధ్యాహ్నం అన్నం తిన్నాం కదా... సాయంత్రం మళ్లీ భోజనం చేయాలా...? అన్నట్లుగా ఈ ప్రశ్న ఉంటుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఒక్కో నదికి ప్రతి 12 ఏళ్లకోసారి పుష్కర పుణ్యస్నానం వస్తుంది. కనుక ఆయా నదులకు సంక్రమించే పుష్కరాల కాలంలో పుణ్యస్నానాలు చేయడం

Webdunia
మంగళవారం, 9 ఆగస్టు 2016 (19:59 IST)
మధ్యాహ్నం అన్నం తిన్నాం కదా... సాయంత్రం మళ్లీ భోజనం చేయాలా...? అన్నట్లుగా ఈ ప్రశ్న ఉంటుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఒక్కో నదికి ప్రతి 12 ఏళ్లకోసారి పుష్కర పుణ్యస్నానం వస్తుంది. కనుక ఆయా నదులకు సంక్రమించే పుష్కరాల కాలంలో పుణ్యస్నానాలు చేయడం ద్వారా పాపాలు నశించి పుణ్యం వస్తుందని పురాణాలు చెపుతున్నాయి. 
 
ఒక్కో రాశిలో గురువు ప్రవేశించేటప్పుడు ప్రతీ నదికి పుష్కరాలు నిర్వహిస్తారు. మన దేశంలో ఉన్న 12 నదులలో ఒక్కో నదికి ఒక్కో సంవత్సరం చొప్పున పుష్కరాలు వస్తాయి. ఈ పుష్కరాలను 12 రోజుల పాటు నిర్వహిస్తారు. నవగ్రహాల్లోని గురుగ్రహం సంవత్సరానికి ఒకసారి చొప్పున 12 రాశుల్లో సంచరిస్తుంటుంది. చాంద్రమానం ప్రకారం నక్షత్రాలు 27, తొమ్మిది పాదాలు కలిసి ఒక రాశి ఏర్పడతాయి. ప్రతి ఏడాది గురువు ఆయా రాశుల్లో ప్రవేశిస్తాడు.
 
మేషరాశిలో గురువు ప్రవేశించినప్పుడు గంగానదికి, వృషభరాశిలో ప్రవేశించినప్పుడు నర్మదానదికి, మిథునరాశిలో ప్రవేశించినప్పుడు సరస్వతి నదికి, కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు యమునా నదికి, సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి నదికి, కన్యారాశిలో ప్రవేశించినప్పుడు కృష్ణానదికి, తులారాశిలో ప్రవేశించినప్పుడు కావేరి నదికి, వృశ్చిక రాశిలో ప్రవేశించినప్పుడు భీమరథీ నదికి, ధనూరాశిలో ప్రవేశించినప్పుడు పుష్కరవాహిని (తపతి) నదికి, మకర రాశిలో ప్రవేశించినప్పుడు తుంగభద్ర నదికి, కుంభరాశిలో ప్రవేశించినప్పుడు సింధూనదికి, మీనరాశిలో ప్రవేశించినప్పుడు ప్రాణహిత నదికి పుష్కరాలు వస్తాయి. ఇలా ఒక్కోనదికి ఒక్కో రాశి అధిష్టానమై ఉంటుంది కనుక పుష్కర సమయంలో ఆ నదిలో సకల దేవతలు కొలువై వుంటారు. సకల దేవతలు కొలువై ఉన్న సమయంలో నదీ పుష్కర స్నానం ఆచరించడం వల్ల సకల దేవతలకు మనం కొలిచినట్లు అవుతుందని విశ్వాసం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కళ్లలో కారప్పొడి చల్లి.. కాళ్లుచేతులు కట్టేసి.. కసితీరా కత్తితో పొడిచి చంపేసింది..

Smiling Face Sky: అరుదైన ఖగోళ దృశ్యం.. చంద్రునికి దగ్గరగా శుక్ర-శని గ్రహాలు.. ఆకాశంలో స్మైలీ

జార్ఖండ్‌లో కర్ణిసేన రాష్ట్ర అధ్యక్షుడు అనుమానాస్పద మృతి!!

మాజీ డీజీపీ భర్తను లేపేసిన భార్య.. ఐ హ్వావ్ ఫినిష్డ్ మాన్‌స్టర్ మెసేజ్!

Skull Discovered on Mars: అంగారక గ్రహంపై మానవ పుర్రె లాంటి రాయి

అన్నీ చూడండి

లేటెస్ట్

గుడ్ ఫ్రైడే: మానవాళికి శాశ్వతమైన మోక్షాన్నిచ్చిన జీసస్

12 సంవత్సరాల తర్వాత ఏర్పడే గజ లక్ష్మీ రాజయోగం- ఆ 3 రాశులు వారు పట్టిందల్లా?

పంచమి తిథి : వారాహి దేవిని ఇలా పూజిస్తే?

17-04-2025 గురువారం ఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం...

రాహు-కేతు పరివర్తనం.. సింహం, కన్యారాశికి అంతా అనుకూలం

తర్వాతి కథనం
Show comments