కృష్ణా పుష్క‌రాలు... మ‌ట‌న్ చికెన్ షాపులు బంద్... గొల్లుమంటున్న చికెన్ చాచీలు!

విజ‌య‌వాడ ‌: ఉరుము ఉరిమి మంగ‌ళం మీద‌ప‌డిన‌ట్లు... కృష్ణా పుష్కరాలు వ‌చ్చి... మాంసాహార ప్రియుల‌పై ప‌డింది. కృష్ణా పుష్క‌రాల సంద‌ర్భంగా, విజయవాడలో మాంసం అమ్మకాలు చేయవద్దని స్థానిక యంత్రాంగం ఆదేశించడం వివాదంగా మారుతోంది. మామూలుగా అయితే పుష్కర స్నానాలు జ

Webdunia
మంగళవారం, 9 ఆగస్టు 2016 (15:36 IST)
విజ‌య‌వాడ ‌: ఉరుము ఉరిమి మంగ‌ళం మీద‌ప‌డిన‌ట్లు... కృష్ణా పుష్కరాలు వ‌చ్చి... మాంసాహార ప్రియుల‌పై ప‌డింది. కృష్ణా పుష్క‌రాల సంద‌ర్భంగా, విజయవాడలో మాంసం అమ్మకాలు చేయవద్దని స్థానిక యంత్రాంగం ఆదేశించడం వివాదంగా మారుతోంది. మామూలుగా అయితే పుష్కర స్నానాలు జరిగే నదీ తీరానికి 500 మీటర్ల వరకు ఇలాంటి ఆదేశాలు ఇస్తుంటారు. కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుష్కరాల సందర్భంగా విజయవాడ అంతటా మాంసం విక్రయాలు ఉండరాదని సూచించారు. దీంతో ఇది పెద్ద ఇబ్బందిగా మారిందని అధికారులే అంటున్నారు. 
 
వివిధ మతాలవారు, మాంసాహారులు ఉండే విజయవాడలో మాంసాహారులను ఇబ్బందిపెట్టడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. పైగా వేలాదిమంది మటన్, చికన్ విక్రయదారులు ఈ నెల నుంచి 9 నుంచి 23 వరకు తమ వ్యాపారాలను మానుకోవడం వల్ల ఆర్థికంగా నష్టపోతారని వాపోతున్నారు. స్టార్ హోటళ్ల వారైతే తాము అలాంటి ఆదేశాలను పాటించలేమని చెబుతున్నారు. 
 
దేవాలయాలను కూల్చుతూ ఒక వైపు, మాంసాహారాన్ని నిషేధిస్తూ మరోవైపు ప్రభుత్వం పరస్పర విరుద్ధంగా వ్యవహరిస్తోందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, ప‌విత్ర పుష్క‌రాల స‌మ‌యంలో 12 రోజుల పాటు మాంసం తిన‌కుండా ఉండ‌లేరా అంటూ, కొంద‌రు పురోహితులు వాదిస్తున్నారు. అయినా, మెగా ఉత్స‌వానికి అంద‌రూ అంతో ఇంతో స‌హ‌కరించ‌డం... మంచిద‌ని పేర్కొంటున్నారు. మ‌రి మ‌ట‌న్ లేనిదే ముద్ద దిగ‌ని వారికి ఈ 12 రోజులు ప‌స్తులేనా... వేచి చూడాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh: 99 పైసలకే భూమిని ఇచ్చినప్పుడు చాలామంది ఎగతాళి చేశారు.. నారా లోకేష్

సిడ్నీ ఉగ్రదాడి నిందితుడు సాజిద్ హైదరాబాదీయేనట

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ఏడుగురు మహిళలతో 34మంది మావోలు లొంగుబాటు

ఎనిమిదేళ్ల కుమార్తెను నాలుగో అంతస్థు నుంచి కిందికు విసిరేసిన తల్లి

పెళ్లై 15 ఏళ్లయినా భార్య మరొకరితో వివాహేతర సంబంధం, కన్నీటి పర్యంతమైన భర్త

అన్నీ చూడండి

లేటెస్ట్

14-12-2025 ఆదివారం ఫలితాలు - పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు...

13-12-2025 శనివారం ఫలితాలు - సర్వత్రా అనుకూలం.. కష్టం ఫలిస్తుంది...

డిసెంబర్ 13, 2025, శనివారం, కృష్ణపక్ష నవమి: పది రూపాయలు ఖర్చు చేసి.. ఈ దీపాన్ని వెలిగిస్తే..?

Lakshana shastra: మహిళల బొడ్డుతో పాటు ఎడమ బుగ్గపై పుట్టుమచ్చ వుంటే?

12-12-2025 శుక్రవారం ఫలితాలు - ధనలాభం.. వాహనసౌఖ్యం పొందుతారు...

తర్వాతి కథనం
Show comments