Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలకు బ్రెడ్ తినిపించి స్కూలుకు పంపుతున్నారా?

Webdunia
సోమవారం, 24 జూన్ 2019 (18:42 IST)
ఉదయం అల్పాహారం చేసే ఓపిక లేని కొంత మంది తల్లులు పిల్లలకు బ్రెడ్ తినిపించి స్కూల్‌కి పంపిస్తుంటారు. పెద్దలు కూడా టీలు, కాఫీలతోపాటు బ్రెడ్ తింటుంటారు. బ్రెడ్‌తో తయారు చేసిన వివిధ వంటకాలను కూడా చాలా మంది తింటుంటారు. అయితే బ్రెడ్ అరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
ఉదయం పూట బ్రెడ్ తింటే గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలతో పాటు డ్రిప్రెషన్ వంటి మానసిక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. బ్రెడ్‌లో ఉండే గ్లూటెన్ అనే ఆమ్లం మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. దీంతో మెదడు పనితీరు మందగించి ఒత్తిడి పెరుగుతుంది. తప్పనిసరి పరిస్థితులలో తినవలసి వస్తే, తిన్న తర్వాత ఏదైనా పండు తినాలని సూచిస్తున్నారు. 
 
కానీ రెగ్యులర్‌గా మాత్రం బ్రెడ్‌ని తీసుకోకూడదట. బ్రెడ్ సాధారణంగా ఏ రూపంలోనూ శరీరానికి పోషకాలు అందించదు. అయితే గోధుమ బ్రెడ్ మాత్రం కొంత పరిమాణంలో పోషకాలు అందిస్తుంది. బ్రెడ్‌లో అధిక రక్తపోటుకు కారణమయ్యే సోడియం లెవల్స్ ఎక్కువ స్థాయిలో ఉంటాయి. దీనిలో ఉప్పు అధికంగా ఉండటం వలన పలు రూపాల్లో తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. 
 
బ్రెడ్ సంబంధిత పదార్థాలైన కేకులు, బర్గర్లు వంటివి తీసుకుంటే కూడా చక్కెర స్థాయిలు అధికంగా ఉండి బరువు పెరగడానికి కారణమవుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments