షుగర్(మధుమేహం) వచ్చిందంటే ఆ వ్యాధిని తగ్గించుకోవడానికి వ్యాధిగ్రస్తులు గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంటారు. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు పాటిస్తారు. అయితే చాలామందికి షుగర్ వ్యాధి వచ్చాక బంగాళాదుంపను తినవచ్చా లేదా అనే సందేహం ఉంటుంది. కారణమేమిటంటే ఇందులో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది.
అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే బ్రెడ్, అన్నంతో పోల్చుకుంటే ఇందులో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. కాబట్టి నిరంతరభ్యంగా వీటిని తినవచ్చు. అదే విధంగా ఆహారంలో ఆలూని తీసుకున్నప్పుడు, ఆహారంలో తక్కువ కేలరీలు ఉండేటట్లు చూసుకోవడం మంచిది. ఏది ఏమైనా వైద్యుడిని సలహా అడిగి తెలుసుకోవడం ఉత్తమం.