Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెక్ ప్రపంచంలో ఇంటర్నెట్ ఒక్క నిమిషం ఆగిపోతే.. ఇవన్నీ ఆగిపోతాయి

కంప్యూటర్ యుగంలో ఇంటర్నెట్ అత్యంత కీలక పాత్రను పోషిస్తోంది. మారుమూల గ్రామాల్లోకి సైతం ఇది చొచ్చుకుని పోయింది. ఏం చేయాలన్నా.. ఏం కొనాలన్నా.. ఏం తినాలన్నా.. ఇంటర్నెట్‌ సాయంతోనే ఆర్డర్లిస్తూ.. తమ పనులను

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (07:14 IST)
కంప్యూటర్ యుగంలో ఇంటర్నెట్ అత్యంత కీలక పాత్రను పోషిస్తోంది. మారుమూల గ్రామాల్లోకి సైతం ఇది చొచ్చుకుని పోయింది. ఏం చేయాలన్నా.. ఏం కొనాలన్నా.. ఏం తినాలన్నా.. ఇంటర్నెట్‌ సాయంతోనే ఆర్డర్లిస్తూ.. తమ పనులను ఇంటిపట్టునే ఉంటూ చక్కబెట్టేస్తున్నారు. 
 
ఇక సోషల్‌ మీడియా జోరు గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నెటిజన్లను 24 గంటలూ నెట్టింట్లోనే గడిపేలా చేస్తున్నాయి. ఇందుకోసం ఇంటర్నెట్‌ అంతగా వాడేస్తున్నాం. మరి అలాంటి ఇంటర్నెట్‌ సదుపాయం ప్రపంచమంతా ఒక్కసారిగా నిలిచిపోతే..? ఇది ఊహకే అందని ప్రశ్న. 
 
కానీ.. ఈ కింది లెక్కలు చూస్తే అర్థమవుతుంది.. కేవలం ఒక్క నిమిషం పాటు ఇంటర్నెట్‌ పూర్తిగా నిలిచిపోతే ఏం జరుగుతుందనేదానిపై  'ఇంటర్నెట్‌లైవ్‌స్టాట్స్‌.కాం'తో పాటు.. 'ఇంటర్నెట్‌ వరల్డ్‌ స్టాట్స్‌' సంస్థలు వెల్లడించిన వివరాలు..
 
* గూగుల్‌- 33,63,780 అన్వేషణలు 
* ఫేస్‌బుక్‌- 7,01,389 లాగిన్‌లు 
* యూట్యూబ్‌- 78,21,360 వీక్షణలు(వ్యూస్‌) 
* ట్విట్టర్‌- 4,39,860 ట్వీట్లు 
* వాట్సాప్‌- దాదాపు 2 కోట్ల 10 లక్షల సందేశాలు 
* ఇన్‌స్టాగ్రామ్‌- 44,400 ఫొటోల అప్‌లోడింగ్‌ 
* ఈమెయిల్స్‌- 15,12,20,340 (ఇందులో 67శాతం స్పామ్‌ మెయిల్స్‌) 
* 22,63,020 జీబీల ఇంటర్నెట్‌ ట్రాఫిక్‌ 
* స్నాప్‌చాట్‌- 5,27,760 ఫొటో షేర్లు 
* స్కైప్‌- 1,35,480 కాల్స్‌ 
* తంబ్లర్‌- 69,240పోస్టులు 
* యాపిల్‌ యాప్‌స్టోర్‌ నుంచి 51 వేలకుపైగా యాప్‌ డౌన్‌లోడ్లు 
* అమెజాన్‌- దాదాపు కోటి 40 లక్షల విలువైన కొనుగోళ్ల స్తంభన
* లింక్డ్‌ఇన్‌-120కిపైగా కొత్త ఖాతాదారుల చేరిక 
ఒక్క నిమిషం పాటు ఇంటర్నెట్‌కు అంతరాయం ఏర్పడితే.. ఇవన్నీ ఆగిపోతాయి. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments