Webdunia - Bharat's app for daily news and videos

Install App

యోనో యాప్ కస్టమర్లకు బంపర్ ఆఫర్- వీక్లి డిస్కౌంట్‌గా రూ.10వేలు

Webdunia
శనివారం, 17 ఏప్రియల్ 2021 (14:33 IST)
దేశీ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంచింది. ఈ ఆఫర్ యోనో యాప్ ఉపయోగించే కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఎస్‌బీఐ యోనో కస్టమర్లు రూ.10 వేల వరకు వీక్లి డిస్కౌంట్ పొందొచ్చు. ట్రావెల్ టికెట్లు బుక్ చేసుకునే వారికి ఇది వర్తిస్తుంది. 
 
ఎస్‌బీఐ యోనో ద్వారా ఈజీ మై ట్రిప్‌లో ఫ్లైట్, హోటల్స్, బస్ టికెట్లను బుక్ చేసుకుంటే రూ.10వేల వరకు వీక్లి డిస్కౌంట్ వస్తుంది. ఎస్‌బీఐ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఆఫర్ పొందాలని భావించే వారు రూపేఈఎంటీ అనే కోడ్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది.
 
కాగా మరోవైపు ఎస్‌బీఐ కార్డ్ తన కస్టమర్లకు తీపికబురు అందించింది. అదిరిపోయే ఈఎంఐ ఆప్షన్ అందిస్తోంది. పెద్ద మొత్తంలో చేసిన కొనుగోళ్లను ఈజీ ఈఎంఐ రూపంలోకి మార్చుకోవడానికి వెసులుబాటు కల్పిస్తోంది. దీంతో చాలా మందికి బెనిఫిట్ కలుగనుంది. 
 
అంతేకాకుండా మరో బెనిఫిట్ కూడా కల్పిస్తోంది. కస్టమర్లు వారి కొనుగోళ్లను ఈఎంఐ రూపంలోకి మార్చుకుంటే ప్రాసెసింగ్ ఫీజులో 100 శాతం మాఫీ కల్పిస్తోంది. అంటే ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండానే ఈఎంఐలోకి మార్చుకోవచ్చు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

కొన్ని రోజులు థియేటర్స్ లో వర్క్ చేశా, అక్కడే బీజం పడింది : హీరో ధర్మ

ట్రెండ్ కి తగ్గట్టుగా పండు చిరుమామిళ్ల ప్రేమికుడు రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments