Webdunia - Bharat's app for daily news and videos

Install App

2 రోజుల్లో 10 లక్షల స్మార్ట్ ఫోన్స్ సేల్...

దసరా పండుగ సీజన్‌ను చైనా మొబైల్ తయారీ కంపెనీ జియోమీ బాగా క్యాష్ చేసుకుంది. గత రెండు రోజుల్లోనే ఈ కంపెనీకి చెందిన 10 లక్షల స్మార్ట్ ఫోన్లను వినియోగదారులు బుక్ చేసుకున్నారు.

Webdunia
శనివారం, 23 సెప్టెంబరు 2017 (13:50 IST)
దసరా పండుగ సీజన్‌ను చైనా మొబైల్ తయారీ కంపెనీ జియోమీ బాగా క్యాష్ చేసుకుంది. గత రెండు రోజుల్లోనే ఈ కంపెనీకి చెందిన 10 లక్షల స్మార్ట్ ఫోన్లను వినియోగదారులు బుక్ చేసుకున్నారు. 
 
దసరా ధమాకాను పురస్కరించుకుని ఈ-కామర్స్‌ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ ఇండియాలు మెగా సేల్‌ నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. ఈ మెగా సేల్‌లో జియోమీ స్మార్ట్‌ఫోన్లు దుమ్మురేపుతున్నాయి. రెండు రోజుల్లో 10 లక్షల షావోమి స్మార్ట్‌ఫోన్లు అమ్ముడుపోయాయి. భారీ డిస్కౌంట్‌ ఆఫర్లతో ఈ-కామర్స్‌ దిగ్గజాలు ఈ సేల్‌ ఈవెంట్లను నిర్వహిస్తున్నాయి. 
 
రెండు రోజుల గణాంకాల ప్రకారం, సగటున ప్రతి నిమిషానికి 300కు పైగా స్మార్ట్‌ఫోన్లు అమ్ముడపోయినట్టు జియోమీ వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఈ పండుగ సీజన్‌లో విక్రయాలు భారీ ఎత్తున్న పెరిగినట్టు కంపెనీ చెప్పింది. జియోమీకి భారత్ మార్కెట్ అత్యంత కీలకంగా ఉన్న విషయం తెల్సిందే 
 
అలాగే, రెడ్‌మి నోట్‌ 4 స్మార్ట్‌ఫోన్లు హాట్‌కేక్‌లా అమ్ముడుపోతున్నట్టు తెలిపింది. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డే సేల్‌లో అత్యధికంగా అమ్ముడుపోతున్న స్మార్ట్‌ఫోన్‌గా రెడ్‌మి నోట్ ‌4 పేరులోకి వచ్చిన కంపెనీ చెప్పింది. అమెజాన్‌ ఇండియాలో కూడా అమ్ముడుపోతున్న తొమ్మిది స్మార్ట్‌ఫోన్లలో ఎనిమిది జియోమీకి చెందినవి ఉండటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments