Webdunia - Bharat's app for daily news and videos

Install App

షియోమి నుంచి 5జీ స్మార్ట్ ఫోన్లు.. నవంబర్ 24 రెడ్‌మి నోట్ 9 5G సిరీస్‌

Webdunia
మంగళవారం, 17 నవంబరు 2020 (15:40 IST)
Xiaomi Redmi Note 9 5G
ప్రస్తుతం 5జీ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి రావడం ఫ్యాషనైపోయింది. తాజాగా ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమి కూడా రెడ్‌మి నోట్ 9 5G సిరీస్‌ను నవంబర్ 24 2020న విడుదల చేయనుంది. ఆన్‌లైన్ టిప్‌స్టర్ విడుదల చేసిన వివరాల ప్రకారం ఈ కొత్త సిరీస్‌లో రెండు కొత్త 5G ఫోన్లను విడుదల చేయనున్నాయి. రెడ్‌మి నోట్ 9 5G సిరీస్‌ను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. 
 
షియోమి సంస్థ ఐఎండీఎ ధృవీకరణలో సూచించిన M2007J22G మోడల్ నెంబర్ కంటే ముందే 'C' ప్రిఫిక్స్ ను ఉపయోగిస్తుంది. ఇది చైనాలో లాంఛ్ కావడాన్ని సూచిస్తుంది. ఇతర ప్రిఫిక్స్ 'G' ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించబడుతుంది. ఇంకా దీని గ్లోబల్ రిలీజ్ కోసం రెడ్‌మి నోట్ 10 5G అని పేరును కూడా సంస్థ ప్రకటించింది.
 
రెడ్‌మి నోట్ 9 స్మార్ట్‌ఫోన్ 5G కనెక్టివిటీ ఫీచర్స్
రెడ్‌మి నోట్ 10 ఫోన్ 5G.. ఎన్ఎఫ్‌సీ కనెక్టివిటీ రెండింటిని కలిగి ఉంటుంది. దీనికి తోడుగా 22.5డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. అయితే చైనాలో కొత్త రెడ్‌మి నోట్ 9 సిరీస్ మూడు మోడళ్లతో విడుదల కానుంది. మూడు మోడళ్లలో రెండు 5జీ వేరియంట్లు, ఒకటి 4జీ ఉండడం గమనార్హం. ఈ సిరీస్ 4జీ వేరియంట్‌ను షియోమి భారతదేశం వంటి అంతర్జాతీయ మార్కెట్లకు అందుబాటులోకి తెస్తుందని భావిస్తున్నారు.
 
రెడ్‌మి నోట్ 9 5G ఫోన్ స్పెసిఫికేషన్ వివరాలు
హై-ఎండ్ మోడల్ రెడ్‌మి నోట్ 9 5జీ ప్రో స్మార్ట్‌ఫోన్ 108ఎంపీ రియర్ కెమెరాను కలిగి ఉండి ISOCELL HM2 SoCను కలిగి ఉన్నట్లు సమాచారం. ఇదే గనుక జరిగితే రెడ్‌మి సిరీస్ ఫోన్లలో ఇంత శక్తివంతమైన లెన్స్‌ను కలిగి ఉండటం ఇదే మొదటిసారి అవుతుంది. 
 
లో-ఎండ్ రెడ్‌మి నోట్ 5జీ ఫోన్ 6.53-అంగుళాల ఎఫ్‌హెచ్డీ ప్లస్ హోల్-పంచ్ డిస్ప్లేతో వస్తుంది. అలాగే హై-ఎండ్ మోడల్ 6.67-అంగుళాల FHD+ ఎల్‌సిడి హోల్-పంచ్ డిస్ప్లేతో వస్తుందని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments