షావోమి నుంచి ఆండ్రాయిడ్ ఫోన్ రానుంది. ఎలాంటి కస్టమైజ్డ్ యూఐ లేకుండా ప్యూర్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకునేవారి కోసం షావోమి ఆండ్రాయిడ్ వన్ ప్రోగ్రామ్ కింద 'ఏ' సిరీస్ ఫోన్లను తీసుకొస్తోంది.
ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు ఎంఐ ఏ1, ఏ2, ఏ3 ఫోన్లు వచ్చాయి. తక్కువ ధరలో నాణ్యమైన ఫోన్లు కావడంతో యువతలో వీటికి మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే, ఇకపై ఈ సిరీస్‌లో ఎలాంటి ఎలాంటి ఫోన్లు రావు. ఇటీవలే ఆ కంపెనీ ఈ విషయాన్ని స్పష్టంచేసింది. అంటే ఏ3నే ఈ సిరీస్‌లో చివరి ఫోన్ అన్నమాట.
ఈ సిరీస్‌లో ఫోన్లను తీసుకురాకపోవడానికి షావోమి ఎలాంటి కారణాన్ని పేర్కొనలేదు. అయితే, ఈ ఫోన్లకు అప్‌డేట్లు అందించడమొక్కటే ఆ కంపెనీ భారంగా భావిస్తోందని సమాచారం.
ఆండ్రాయిడ్ వన్ ప్రోగ్రామ్ కింద మూడేళ్ల పాటు అప్‌డేట్స్ అందించాల్సి ఉంటుంది. అందుకే ఇకపై ఈ ఫోన్లను తీసుకురాకుండా తన ఆండ్రాయిడ్ ఫోన్లను కస్టమైజ్ చేసి ఎంఐయూఐతోనే తీసుకురావాలని భావిస్తోంది.