మొబైల్ ఫోన్ల తయారీలో ఒకటైన షియోమీ తాజాగా ప్రవేశపెట్టిన మోడల్ రెడ్మీ 6. ఈ ఫోను ధరను భారత్‌లో మాత్రం తగ్గించింది. 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోనుపై రూ.500 తగ్గించింది. ఫలితంగా ఈ రకం ఫోన్ ధర ఇపుడు రూ.7999కు కొనుగోలు చేయవచ్చు. అలాగే, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను కూడా రూ.500 మేరకు తగ్గించింది. ఈ ఫోను ధర ఇపుడు రూ.8900గా నిర్ణయించింది.